Saturday, December 3, 2022

జగన్, కేసీఆర్ క్విడ్ ప్రోకోలోభాగంగానే పోలవరం ఎత్తు తగ్గింపు: నిమ్మల రామానాయుడు

బహుళార్థసాథక ప్రాజెక్ట్ అయిన పోలవరం నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం చెక్ డ్యామ్ లా, పిల్లకాలువలా భావిస్తోంది. రేడియల్ క్రస్ట్ గేట్ల తయారీ, నాణ్యత, నిర్మాణం, అమరికలో జగన్ ప్రభుత్వ చర్యలతో ప్రాజెక్ట్ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పంపులు తయారుచేసుకునే కంపెనీకి క్రస్ట్ గేట్ల నిర్మాణ బాథ్యతలు అప్పగించడంద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రశ్నార్థకం చేసింది. ప్రాజెక్ట్ ఎత్తుతగ్గిస్తే, పోలవరం నిర్మాణంయొక్క అర్థం, పరమార్థమే మారిపోతుంది. జగన్ అనే సుడిగుండలో పోలవరం ప్రాజెక్ట్ చిక్కుకుంది. కేసీఆర్ తోజగన్ చేసుకున్న చీకటిఒప్పందంలో భాగంగానే ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్రజలశక్తి మంత్రిత్వశాఖలో సలహాదారుగా ఉన్న వెదిరే శ్రీరామ్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వసలహాదారుగా ఉన్న ఆయనభార్య శిల్పారెడ్డిలు ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపునకు సంబంధించిన ప్రపోజల్స్ కేంద్రానికి ఇచ్చారు. ఫిబ్రవరి 16న జరిగిన సమావేశంలో వారుఇచ్చిన సమాచారాన్ని జగన్ బహిర్గతంచేయాలి. ఎన్నికల సమయంలో కేసీఆర్ జగన్ కు నిధులిస్తే , అందుకు మూల్యంగా ఈ ముఖ్యమంత్రి ఆయనకు నీళ్లు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ప్రాజెక్ట్ ఎత్తుతగ్గించడంద్వారా నిర్మాణ వ్యయం రూ.55వేలకోట్లనుంచి రూ.30వేలకోట్లకే పరిమితమవుతుంది. నిర్మాణ వ్యయంలో మిగిలే రూ.25వేలకోట్లను కొట్టేయాలన్నదేజగన్ దురాలోచన. తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను జగన్ ఎందుకు ఖండించలేదు? జగన్ క్విడ్ ప్రోకో విధానాలకు పోలవరాన్ని బలికానివ్వం. ప్రాజెక్ట్ ను కాపాడుకోవడానికి రాష్ట్ర రైతాంగంతో కలిసి టీడీపీ పోరాడుతుంది.

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...