Saturday, December 3, 2022

ఎస్ఈసీ సంచలన నిర్ణయం.. వాలంటీర్ల సేవలకు బ్రేక్ !

అమరావతి: మున్నిపల్ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే పలు పిటిషన్లను విచారించిన హైకోర్టు.. మున్సిపల్ ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోలేం అని స్పష్టం చేసింది. దీంతో ఈ నెల 10వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వరుస క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోను వాలంటీర్ల వినియోగం ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు పూర్తైన వరకు వాలంటీర్ల కదలికలపై దృష్టి పెడతామన్నారు. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో వాలంటీర్ల పాత్రలపై పలు అనుమానాలు తలెత్తాయి. విపక్ష పార్టీలన్నీ వాలంటీర్లే దగ్గరుండి అధికారపక్షానికి సహకరించారని.. ఫిర్యాదులు చేశాయి. ఈ నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి ఐదుకు మించి సభ్యులు ఉండకూడదని నిబంధన పెట్టారు. కానీ ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారాలు చూస్తే ఎక్కడా అధికారులు అలాంటి ఆంక్షలు పెట్టలేదు.

ప్రతి కార్పొరేటర్ అభ్యర్థి ప్రచారంలో 50కి పైగా అనుచరులు పాల్గొంటున్నారు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఆర్భాటంగా ఎన్నికల ప్రచారం చేస్తే వారిపై కేసులు పెడతమంటున్నారు. కోవిడ్ నిబంధనలు తప్పక అందరూ పాటించాల్సిందే అని ఎస్ఈసీ అన్నారు. ఎన్నికల్లో మద్యం, డబ్బుల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. చెక్ పోస్టుల దగ్గర పోలీసుల తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయి అన్నారు. అలాగే ఒత్తిడికిలోనై, భయబ్రాంతులకు గురై నామినేషన్లు విత్ డ్రా చేసుకుంటున్నామని ముందుకు వచ్చి ఎవరైతే ఫిర్యాదు చేస్తారో వారికి ఎన్నికల కమిషనర్ తరపున కచ్చితంగా భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయినా నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని ఎవరైనా ఆధారాలను చూపిస్తే పున పరిశీలిస్తామన్నారు. ఈ సోమవారం వరకు అన్ని రాజకీయ పార్టీల నేతల ఫిర్యాదులను స్వీకరిస్తామని హామీ ఇచ్చారు. భారీగా పోలింగ్ నమోదు కాావాలని ఆశిస్తున్నాను అన్నారు.

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...