Saturday, December 3, 2022

కోవిడ్ వేళ.. జగనన్న సంక్షేమ పథకాలే పేదలకు శ్రీరామరక్షః మంత్రి పేర్ని నాని

 • చంద్రబాబు హయాంలో కోవిడ్ వచ్చిఉంటే.. చందాలకు రెడీ అయి ఉండేవారు
 • రెండేళ్ళ శ్రీ జగన్ సుభిక్షమైన పరిపాలనపై చర్చ జరగకూడదనే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్
 • 40 ఏళ్ళ అనుభవం చేయలేనిది.. 40 ఏళ్ళ యువ నాయకుడు చేస్తుంటే బాబుకు ఓర్వలేనితనం
 • అభివృద్ధి, సంక్షేమంలో ముఖ్యమంత్రి శ్రీ జగన్ కు ఎవరూ సాటి రారు
 • మేనిఫెస్టోలో 94.5 శాతం వాగ్దానాలను రెండేళ్ళ పాలన పూర్తి కాకముందే నెరవేర్చాం.
 • రెండేళ్ళలో రూ. 1.25 లక్షల కోట్లు అవినీతికి తావు లేకుండా ప్రజలకు అందించాం.
 • చంద్రబాబు కొడుకు హెరిటేజ్‌ బేబీనా..?
 • అమూల్ బలపడితే.. హెరిటేజ్ లాంటి సంస్థలు దివాళాతీస్తాయన్నదే వీరి భయం
 • టీడీపీ నేత బీసీ జనార్థనరెడ్డి దళితులపై దాడులు చేస్తే కేసు కట్టకూడదా..?
 • ధూళిపాళ్ళ నరేంద్రను సంగం డెయిరీ ఛైర్మెన్ గా గతంలో రాజీనామా చేయమని చెప్పింది చంద్రబాబు కాదా..?

శ్రీ పేర్ని నాని మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే… ఆయన మాటల్లోనే..

 1. గడచిన కొద్దిమాసాలుగా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు వింత పోకడలు, బరితెగింపు మాటలు చూస్తుంటే.. వారిలో మానసికంగా ఏ స్థాయిలో భయాందోళనలు వెంటాడుతున్నాయో అర్థమవుతుంది. గత 5 ఏళ్ళ టీడీపీ దుర్మార్గ, దోపిడీ పరిపాలన ఒకవైపు.. మరోవైపు రెండేళ్ళ జగన్ మోహన్ రెడ్డిగారి సంక్షేమ, సుభిక్ష పాలనను ప్రజలు పోల్చి చూసి ఎక్కడ గడ్డి పెడతారేమో అని వారు భీతిల్లుతున్నట్టు కనిపిస్తోంది.
 2. తాను అయిదేళ్ళు, అంతకు ముందు తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేనిది నాలుగు పదుల వయసు దాటని యువకుడు గొప్పగా పరిపాలన చేస్తూ, ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకుంటున్నాడనే అక్కసు చంద్రబాబు, ఆయన కొడుకు మాటల్లో కనిపిస్తోంది.
 3. రెండేళ్ళ కాలంలో సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి… ఏది తీసుకున్నా జగన్‌గారికి ఎవరూ సాటి లేరన్న విషయం ప్రజలకు బాగా అర్థం అయ్యింది కాబట్టి, ఈ నెల 30వ తేదీన జగన్ మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా.. 30 వరకు రోజూ జూమ్ లల్లో ప్రెస్‌మీట్లు పెట్టి తిట్ల వేగాన్ని, ఉత్తర కుమారుడి సవాళ్లను పెంచాలని జూమ్‌ బాబు, జూమ్‌ పార్టీకి జూమ్‌లో సూచించాడు. తెలుగుదేశం పార్టీ అనే పేరును జూమ్‌ దేశంగా పెట్టుకోండి.
 4. జగన్ మోహన్ రెడ్డిగారి రెండేళ్ళ పరిపాలన గురించి ప్రజల్లో చర్చ రాకూడదని, కేవలం చంద్రబాబు మాటలు మీదే చర్చ జరగాలని దుర్మార్గంగా ప్రేలాపనలు పేలుతున్నారు.

– ఈ రెండేళ్ళ పాలనలోనే ఏం జరిగిందో చూడండి…

 • 2019 వరకు ఉన్న రాజకీయ వ్యవస్థను రెండేళ్ళ పాలనలో మార్చాం ..
 • ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎన్నికల్లో ప్రజలను ఏమార్చి బుట్టలో వేసుకుని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక దాన్ని చెత్తబుట్టలో పడేసే పరిస్థితులను మార్చి వేశాం. మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత గా మారుస్తాం అని ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ.. కోవిడ్ కష్ట కాలంలోనూ 129 వాగ్దానాల్లో.. 107 వాగ్దానాలను పూర్తిగా అమలు చేశాం. మిగిలిన 14 వాగ్దానాలు అమలు ప్రారంభమయ్యి వివిధ దశల్లో ఉన్నాయి. కేవలం 8 వాగ్దానాలు మాత్రమే ఇక మిగతా మూడేళ్ళలోపు అమలు చేయాల్సినవి ఉన్నాయి. అంటే, మేనిఫెస్టోలో 94.5 శాతం వాగ్దానాలను రెండేళ్ళ పాలన పూర్తి కాకముందే నెరవేర్చాం.
  – కులం చూడం… మతం చూడం… ప్రాంతం చూడం… పార్టీ చూడం, రాజకీయాలు చూడం అన్న మాటను మనసా వాచా కర్మణా… త్రికరణ శుధ్ధిగా అమలు చేశాం.

మహిళా సాధికారత చరిత్రలో దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో అమ్మ ఒడి, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ చేయూత వంటి పథకాలతో మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ విప్లవాలకు ఏకకాలంలో శ్రీకారం చుట్టింది జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వం.

 • ఈ తరం పిల్లలు ఎదిగిన తరవాత, రాబోయేకాలంలో, అప్పటి ప్రపంచంలో ఎదుర్కోబోయే సవాళ్ళను దృష్టిలో ఉంచుకుని విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాం.
 • గ్రామ స్వరాజ్యానికి అర్థం చెపుతూ వార్డు/గ్రామ సెక్రెటేరియట్‌లను, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి విత్తనం నుంచి అమ్మకం వరకు ప్రతి దశలోనూ రైతన్నకు అండదండగా ఉన్నాం. కాబట్టే… మున్సిపల్‌ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక… ఏది తీసుకున్నా ఒకే జెండా ఎగిరింది. అది వైయస్ఆర్ కాంగ్రెస్ జెండా.

జగన్ మోహన్ రెడ్డి గారు అంటే ఈర్ష్యతో రగిలిపోతున్న చంద్రబాబు లాంటి నాయకులు ఈ ప్రభుత్వం పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు డబ్బుల్ని పంచిపెడుతుందని దిగజారి విమర్శలు చేస్తున్నారు. ఈ వర్గాలకు చెందిన కుటుంబాలు పేదరికం నుంచి బయటకు రావాలంటే… వారి పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది అని జగన్ మోహన్ రెడ్డిగారు నమ్మి, అమ్మ ఒడి ద్వారా తల్లుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా డబ్బులు వేస్తున్నారు. ఏ పథకం చూసినా విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడం, మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన విద్యా వ్యవస్థను అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళాలని లంచాలకు అవకాశం లేకుండా, జన్మభూమి కమిటీల్లాంటి బ్రోకర్లు లేకుండా, రాజకీయాలు చూడకుండా, రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాడకుండా, నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని జగన్ గారు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

 • ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే.. జగన్ గారు అధికారంలోకి వచ్చాక కొత్తగా 16 మెడికల్ కాలేజీలను తీసుకోరాబోతున్నారు. ఇది వైద్య రంగంలోనే పెను విప్లవం.
 • నాడు-నేడు ద్వారా పాఠశాలల ముఖ చిత్రాలు మార్చివేస్తూ, పేద, మధ్య తరగతి విద్యార్థుల్లో ఎక్కడా ఆత్మన్యూనతా భావం రాకుండా, మంచి సౌకర్యాలతో, క్వాలిఫైడ్ ఉపాధ్యాయులతో కార్పొరేట్ కు దీటుగా విద్యను అందిస్తున్నారు.

రాబోయే మూడేళ్ళలో మరింత సుపరిపాలన అందించేందుకు కార్యాచరణ చేస్తూ.. 2019 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఆ ప్రజలను నెత్తి మీద పెట్టుకుని జగన్ మోహన్ రెడ్డిగారు పరిపాలన చేస్తున్నారు.

 • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద, మధ్య తరగతి వర్గాలకు అన్ని విధాలుగా అండగా నిలబడటమే కాకుండా,
  రాష్ట్ర సంక్షేమం- అభివృద్ధిలో భాగంగా..
 • హ్యూమన్‌ క్యాపిటల్‌గా… దాదాపు రూ. 93,708 కోట్లు డీబీటీ ద్వారా… మరో రూ. 31,714 కోట్లు పరోక్ష లబ్ధిద్వారా… మొత్తం 1.25 లక్షల కోట్లు ప్రజలకు నేరుగా… ఎటువంటి అవినీతికీ తావు లేకుండా ప్రజలకు అందించాం.
  –ఈ రెండేళ్ళ కాలాన్నే తీసుకుంటే ఇప్పటివరకు వైయస్సార్‌ పెన్షన్‌ కానుక ద్వారా 61.73 లక్షల మందికి 32,469 కోట్లు; వైయస్సార్‌ రైతు భరోసా ద్వారా 52.38 లక్షల రైతులకు రూ.17,030 కోట్లు; ‘జగనన్న అమ్మ ఒడి’ ద్వారా 44.49 లక్షల అక్కచెల్లెమ్మలకు రూ.13,022 కోట్లు; వైయస్సార్‌ ఆసరా ద్వారా 77.76 లక్షల అక్కచెల్లెమ్మలకు రూ.6311 కోట్లు; వైయస్సార్‌ చేయూత ద్వారా 24.56 లక్షల అక్కచెల్లెమ్మలకు రూ.4,604 కోట్లు… ఇలా 30కి పైగా పథకాల ద్వారా కేవలం ఈ రెండేళ్ళ కాలంలోనే నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి నగదు పంపిణీ ద్వారా రూ. 93,708 కోట్లు అందించాం. పరోక్ష లబ్ధి అందించే వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ వైయస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక, 31 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా రూ. 31,714 కోట్లు… ఇలా మొత్తం రూ.1 లక్షా 25 వేల 422 కోట్లకు పైగా ప్రజల సంక్షేమం మీద ఖర్చు చేశాం.

గతంలో ఏ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అయినా అమలులో పై నుంచి లబ్ధిదారుడు వద్దకు చేరేటప్పటికీ ఐసు గడ్డల్లా కరిగిపోతూ పేదవాడికి చివరికి ఏమీ మిగిలేది కాదు. ఈరోజు ఒక్కపైసా అవినీతి లేకుండా 100 శాతం పూర్తిగా లబ్ధిదారునికి చేరే విధంగా, దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి పైసా ప్రజల అకౌంట్లలో జమ అవుతుంది.

 • దాంతో గ్రామం మారింది. గ్రామ పరిపాలన మారింది. అవినీతి లేకుండా ప్రభుత్వం డబ్బు నేరుగా ప్రజలకు చేరుతోంది. కోవిడ్‌ మహమ్మారి ఏడాదికి పైగా మనకు సవాలు విసిరినా.. మన పేదలు బతకటానికి మన జగనన్న సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అయ్యాయి.

ఏడాదికి పైగా కోవిడ్ ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నా.. జగనన్న సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా నిలిచాయి. కోవిడ్ సమయంలో సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారిని ప్రజలు దీవిస్తున్నారు.

 • మరి ఇదే చంద్రబాబు రోజుల్లో కోవిడ్‌ వచ్చి ఉంటే… వెంటనే చంద్రబాబు, ఎల్లో మీడియా చందాలకు రెడీ అయ్యేవారు. చంద్రబాబు చందా బాబుగా మారి ఉండేవాడు. కష్టంలో ప్రజలుంటే ప్రభుత్వం కష్టంలో ఉందని చెప్పేవాడు. ప్రజలను గాలికొదిలేసే పరిస్థితి.
 • జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాక ముందు ప్రభుత్వాసుపత్రులు ఎలా ఉండేవి, ఇప్పుడు నాడు-నేడు కార్యక్రమంలో ఏ విధంగా అభివృద్ధి చెందాయో ప్రజలు చూస్తున్నారు. గతంలో ఒక్క వైరలజీ ల్యాబ్ కూడా లేదు. ఇవాళ జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి రాగానే శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటూ.. రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో కూడా కోవిడ్ ల్యాబ్ లు ఏర్పాటు చేశారు.

ఏడాదికి పైగా కోవిడ్‌ మనల్ని చుట్టుముడుతున్నా.. ముఖ్యమంత్రి జగన్ గారు సుభిక్షమైన పాలన అందిస్తుంటే.. చంద్రబాబు విషం చిమ్ముతున్నారు. ఈర్ష్యతో కుమిలిపోతున్న గుంటనక్క స్వభావం కలిగిన చంద్రబాబును, అతని ఉత్తర కుమారుడి వేషాలు, నాటకాలు చూస్తున్నాం.

 • ప్రజలను దుష్ట కౌగిలిలో బంధించి గత ఐదేళ్ళూ దోపిడీ పాలన చేసిన చంద్రబాబు ఇప్పుడు నీతులు చెబుతున్నాడు.
 • కోవిడ్ ఉంటే తప్పులు చేసిన వారిని వదిలేస్తారా.. మీరు అధికారంలో ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడు మాదిరిగా కళ్ళకు గంతలు కట్టుకుని ఉండి, మీ వందిమాగధుల దోపిడీని ప్రోత్సహించారు.

కోవిడ్ వస్తే తండ్రీకొడుకులు హైదరాబాద్ లో తల దాచుకుంటారు. అధికారం ఉంటే రోడ్ల మీదకు వస్తారు. ఈ రెండేళ్ళలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడానికి, విషం చిమ్మడానికే రోడ్డు మీదకు వస్తున్నారు తప్పితే ప్రజలకోసం ఏనాడూ రాలేదు.

కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థనరెడ్డి.. వందల మంది సమక్షంలో వైసీపీకి చెందిన దళిత కార్యకర్తలను ఎలా కొట్టమని చెబుతున్నాడో వీడియో సాక్షిగా చూడండి. ఒక మనిషిని, దళితుడిపై ఇంత కిరాతకంగా హత్యాయత్నం చేయబోతే పోలీసులు కేసు కట్టరా.. ? ఇది చంద్రబాబు లా ధృతరాష్ట్రుడు పాలన కాదు. వీడియోల రూపంలో ఇంత పచ్చిగా కనిపిస్తుంటే.. చంద్రబాబుకు కళ్ళు కనిపించడం లేదు. మీకు శుక్లాలు వచ్చాయా.. ఇంకా సిగ్గు లేకుండా టీవీల ముందు నీతి కబుర్లు చెబుతారా..

చంద్రబాబు 13 ఏళ్ళ పరిపాలన అనుభవం ఎందుకు పనికివస్తుంది. గ్రామాల్లో సర్కార్ తుమ్మ చెట్టుకు వయసు వస్తుంది.. ఎందుకూ పనికిరాని తుమ్మ చెట్టు వయసు, చంద్రబాబు అనుభవం ఒక్కటే. చెంచాడు సిగ్గు, చారెడు ఎగ్గు కూడా చంద్రబాబుకు దేవుడు ఇవ్వలేదు. ఈ వయసులో సిగ్గూ, ఎగ్గూ లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నాడు.

 • పోలీసుల మీద తిరగడబడండి.. ప్రైవేటు కేసులు పెట్టండి.. అంటూ దిగజారి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ రాజకీయం చేసే నాయకుడు చంద్రబాబు తప్పితే ప్రపంచంలో ఎవరూ ఉండడు. చంద్రబాబు క్షుద్రరాజకీయాలు, రాజకీయ చేతబడులు చేస్తున్నాడు.

చంద్రబాబు కొడుకు హెరిటేజ్‌ బేబీనా? అందరినీ ప్రధానులు, రాష్ట్రపతులు చేశానన్నది బోగస్‌ అని కొడుకుని ఓడగొట్టుకున్న తండ్రిని చూస్తే అందరికీ అర్థం అయింది.

– సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయన్నది 100కు 100 శాతం నిజం. అయినా ధూళిపాళ్ళ నరేంద్రను వెనకేసుకువచ్చి రోజుకు రెండు ప్రెస్‌మీట్లు పెడుతున్నాడు.
– ఈఎస్‌ఐ స్కాం సూత్రధారి, విగ్రహాల దొంగతనాలకు కర్త కర్మ అయిన అచ్చెన్నాయుడును వెనకేసుకు వస్తున్నాడు.
– లైసెన్స్‌ లేని బస్సుల జేసీ బ్రదర్స్‌ ఎంతమంది జనాన్ని చంపినా కేసే ఉండకూడదన్నది బాబు ఫిలాసఫీ.
– వీరందరినీ వదిలేసి ఈ మధ్య వేరే వ్యక్తిని పట్టుకుని నానా బూతులు తిట్టించి చివరికి భంగపడ్డాడు.
– తమ బతుకు ఇలా ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే… బదులు తీర్చుకుంటాం అని తండ్రీ కొడుకులు కొత్త స్లోగన్‌ అందుకున్నారు. ఎంపీటీసీలూ జడ్పీటీసీల్లో పోటీ చేసి చివరి నిమిషంలో పారిపోయిన బాబు… ఏ ఎన్నికల్లో అధికారంలోకి వస్తాడు?

 • అచ్చెన్నాయుడు జనం సొమ్ము దోచుకుని హల్వా తిన్నట్టు తింటే వదిలేయాలా..? బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే దళితులపై దాడులు చేస్తే కేసు కట్టకూడదా..? ధూళిపాళ్ళ నరేంద్రను మీరు ముఖ్యమంత్రిగా ఉండగా సంగం డెయిరీ ఛైర్మెన్ గా రాజీనామా చేయమని చెప్పింది నిజం కాదా..?
 • రాజీనామా చేస్తే.. మంత్రి ఇస్తానని మీ నోటితో మీరు చెప్పింది నిజం కాదా.. సహకార వ్యవస్థలో రైతు భాగస్వామ్యంలో నడుస్తున్న డెయిరీని కంపెనీ చట్టంలోకి మార్చి, తన కబంధ హస్తాల్లో మార్చుకుంటే.. అది చంద్రబాబుకు నీతిగా కనిపిస్తుందా..? అమూల్ హెరిటేజ్ కంపెనీ లాంటిది కాదు.
 • హెరిటేజ్ పాలతో బాగా పుష్టిగా తయారై పనీపాట లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న హెరిటేజ్ బేబీని చూస్తున్నాం. మీ తండ్రి కుట్రలతో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వరంగ డెయిరీలు మూయించి ఊరూరా హెరిటేజ్ బ్రాంచ్ లు పెట్టుకొని కోట్లు గడించారు. మీ దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ.. మీ రౌడీయిజానికి బ్రేకులు వేస్తే.. జగన్ మోహన్ రెడ్డిగారిని విమర్శిస్తారా…?
 • హెరిటేజ్ పెట్టిన తర్వాత అప్పటివరకూ కోఅపరేటివ్ వ్యవస్థలో విరాజిల్లిన డెయిరీలను, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు వ్యవస్థలోకి వెళ్ళడానికి చంద్రబాబు కారణం కాదా.. అమూల్ అనేది రైతుల సంస్థ. అమూల్ లాంటి కోఆపరేటివ్ సంస్థ బలపడితే.. పాల రైతులను దోచుకుంటున్న హెరిటేజ్ లాంటి సంస్థలన్నీ దివాళాతీస్తాయనేది వీరి భయం.

చంద్రబాబు నాయుడు సుప్రీం దాకా వెళదాం అంటున్నాడు. సుప్రీం అంటే కూడా వీరికి లోకువ అయింది. ఎందుకో అందరికీ తెలిసిన విషయమే. లక్ష జీవాలను హరించిన నక్క.. వృద్ధాప్యంలో నీతి పాఠాలు చెప్పినట్లు ఉంది చంద్రబాబు తీరు.

 • గడియారంలో ముల్లు మాదిరిగా తిరుగుతూ రోజులు లెక్కబెట్టుకున్న తండ్రీకొడుకులకు చెబుతున్నాం.. ఈ మూడు ఏళ్ళు కాదు, మరో ఐదేళ్ళు, ఆ తర్వాత ఐదేళ్ళు.. ఇలా ఎంతకాలం లెక్కబెట్టుకున్నా మీకు అధికారం రాదు.

మహానాడు పేరుతో వర్చువల్ మీటింగ్ పెట్టి చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకోవడానికే ఆ వేదికను వాడుకుంటారు. నాలుగు పదుల వయసు ఉన్న యువ నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారు చేస్తోన్న మంచి పనులు నేనెందుకు చేయలేకపోయాననే మానసిక కుంగుబాటులో చంద్రబాబు ఉన్నారు. పరిషత్ ఎన్నికల్లో కనీసం పోటీ చేయలేక, తోకముడిచి పారిపోయిన మీరు ఎక్కడ అధికారంలో వస్తారు. 2019 ఎన్నికల్లో కంటే మిన్నగా, గత రెండేళ్ళలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించారు.

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...