Saturday, December 3, 2022

చెప్పినవే కాదు.. రైతు సంక్షేమం కోసం చెప్పనివీ చేస్తోన్నఏకైక ప్రభుత్వం ఇదిః మంత్రి కన్నబాబు

 • రైతులతో రాజకీయం చేయడానికి సిగ్గు అనిపించడం లేదా బాబూ..?
 • రెండేళ్ళ కాలంలో పంటల బీమా కింద రూ. 3,783.25 కోట్లు చెల్లించాం
 • కోవిడ్ కష్టకాలంలోనూ ఒకేరోజు రూ. 1820 కోట్లు పంటల బీమా విడుదల చేయడం రికార్డు
 • ఒక్క నెలలోనే రైతుల ఖాతాల్లో రూ. 5,800 కోట్లు జమ చేసిన ప్రభుత్వం దేశంలో ఒక్క ఏపీనే..
 • రైతుల్లో టీడీపీ పరపతి పెరిగితే.. 2019లో ఆ పార్టీకి 23 సీట్లు ఎందుకు వస్తాయి..?

మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..

గతంలో చంద్రబాబు రూ. 87 వేల కోట్లు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని వాగ్దానం చేసి, దానిని రూ.15 వేల కోట్లు చేసి, రుణ మాఫీ చేశాను, తానే రైతు బాంధవుడిన డబ్బా కొట్టుకుంటే 2019లో టీడీపీని ఏ విధంగా ఓడించారో చూశాం. అయినా సరే, కుక్క తోక వంకర అన్నట్టు రైతుల్ని తామే ఉద్దరించినట్టుగా మాట్లాడటం చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకు ఫ్యాషన్ గా మారింది. ఒకే అబద్ధాన్ని పదే పదే చెబితే ప్రజలు నమ్ముతారన్న చంద్రబాబు నాయుడు గోబెల్స్ సిద్ధాంతాన్ని ఆ పార్టీ ఇప్పటికీ అమలు చేస్తుంది.

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండేళ్ళలో దాదాపు రూ. 83 వేల కోట్ల సాయాన్ని వివిధ రూపాల్లో రైతులకు అందజేశాం.కీలకమైన పథకమేమిటంటే.. వైయస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం. గతంలో రైతులు రుణం తీసుకుంటే, రుణం నుంచి ప్రీమియం కట్ చేసుకునేవారు. పంటనష్టం జరిగితే ఎప్పుడు పరిహారం వస్తుందో తెలియని పరిస్థితి.

జగన్ గారు తన సుదీర్ఘ పాదయాత్రలో రైతుల కష్టాలను తెలుసుకుని, అధికారంలోకి వచ్చాక ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తానని హామీ ఇచ్చి, దానిని నవరత్నాల్లో పెట్టారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం వైయస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని అమలు చేస్తున్నారు.

గతంలో మాదిరిగానే, గత ఏడాది ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం చేసుకుని బీమా పథకాన్ని అమలు చేస్తే, ఇప్పుడు సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుని, అది అమలులోకి వచ్చే లోపల ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం గైడ్ లైన్స్ కు లోబడి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం.

చిత్రం ఏమిటంటే.. రైతులకు తామేదో చేశాం అన్నట్టు పెద్ద పెద్ద కబుర్లు చెబుతన్న టీడీపీ నేతలు, గతంలో రైతుల తరఫున చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకపోవడం, రైతులకు ఇవ్వని క్లైములకు సంబంధించి దాదాపు రూ. 715.84 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చాక చెల్లించడం జరిగింది. అలానే 2012లో పులివెందుల ప్రాంతంలో పంట వేసినా, తేదీలు నమోదు చేయలేదన్న కారణంతో రైతులకు క్లైములు ఇవ్వకుండా మానేస్తే వాటికి సంబంధించి రూ. 112 కోట్లు పైగా ఈ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి జగన్ గారు రైతులకు చెల్లించారు.

టీడీపీ హయాంలో రూ. 4 వేల కోట్లు బీమా కింద పరిహారం ఇచ్చాం అని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుడు లెక్కలు చెబుతున్నారు. వాస్తవ లెక్కలు చూస్తే.. నాలుగేళ్ళలో కేవలం రూ. 2900 కోట్లు మాత్రమే ఇచ్చారు.

 • 2016లో 16.36 లక్షల మంది రైతులు, 2017లో 15.93 లక్షలు, 2018లో 16.69 లక్షలు, 2019లో 16.77 లక్షలు మంది రైతులు నమోదు అయితే.. 2020 ఖరీఫ్ లో 37.25 లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా కోసం నమోదు అయ్యారు. అంటే 122 శాతం వృద్ధి. రైతులు ఈ- క్రాప్ లో నమోదు అయితే చాలు, ఆటోమేటిక్ అర్హత సాధించి, క్లైములు వచ్చే విధంగా ముఖ్యమంత్రి జగన్ గారు తెచ్చిన విధానం వల్లే ఇది సాధ్యమైంది.
 • ఇప్పుడు 15.15 లక్షల మంది రైతులకి వైయస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద పరిహారం ఇచ్చాం.
 • బీమా విస్తీర్ణం చూస్తే.. 2016లో 18.45 లక్షలు ఉంటే.. 2020 వచ్చేసరికి 35.75 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని ఈ పరిధిలోకి తీసుకొచ్చాం.
 • ఉచిత పంటల బీమా పథకంలో.. పంటల వాల్యూమ్ చూస్తే.. 2016లో రూ. 9,695 కోట్ల విలువ ఉంటే.. 2017లో రూ. 9,775 కోట్లు.. 2018లో రూ. 11,063 కోట్లు.. 2019లో రూ. 15,275 కోట్లు.. 2020లో రూ. 27,230 కోట్ల విలువైన పంటలకు ఇన్సూరెన్స్ పరిధిలోకి తెచ్చారు.
 • 2016లో 7.75 లక్షలు రైతులు.. 2017లో 6.11 లక్షలు.. 2018లో 10 లక్షలు.. 2020లో 15.15 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరింది.
 • వాస్తవాలు ఇవైతే టీడీపీ నేతలు పచ్చి అబద్ధాలు, సిగ్గు లేని మాటలు మాట్లాడుతున్నారు.

రైతుల్లో పరపతి పెంచుకుంటే 2019 ఎన్నికల్లో టీడీపీకి 23 స్థానాలు ఎందుకు వస్తాయి…? ఆ పార్టీని, ఆ పార్టీ నాయకత్వాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు రైతులు.

 • కోవిడ్ కష్టకాలంలోనూ ఉచిత పంటల బీమాను ముఖ్యమంత్రి జగన్ గారు ఇచ్చారు. మీరు ఎప్పుడైనా సకాలంలో పంటల బీమా ఇచ్చిన ఒక సంఘటన అయినా చూపించగలరా..
 • నిన్న ముఖ్యమంత్రి జగన్ గారు ఒ క్క బటన్ నొక్కి ఈ పథకాన్ని ప్రారంభిస్తే.. టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఇష్టారాజ్యంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఒక రైతుకు రూ. 16 వచ్చిందని మాట్లాడుతున్నారు.
 • పంటల బీమా పరిహారం అనేది సాంకేతిక అంశంగా చూస్తారు. గత 5 ఏళ్ళలో పంట యావరేజ్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత వచ్చింది, దానికి విలువ కట్టి పరిహారం లెక్కిస్తారు. ఇదేదో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చింది కాదు. గతం నుంచీ వస్తున్న విధానమే ఇది. అలానే రూ. 200 లోపే చాలా మందికి వచ్చిందని పత్రికల్లో రాశారు.
 • గత ఏడాది టీడీపీ చివరి సంవత్సరం తీసుకుంటే రూ.100 కంటే తక్కువ పరిహారం వచ్చిన రైతులు 8 వేల మంది ఉన్నారు.
 • ఇప్పుడు తీసుకుంటే 15.15 లక్షల రైతు కుటుంబాల్లో 0.3 శాతం మాత్రమే తక్కువ వచ్చిన రైతులు ఉన్నారు.

ఉద్యాన రైతులకు సంబంధించి… నష్టపోయిన ఒక్కో రైతుకు రూ. లక్షకు పైగా బీమా వచ్చిన వాళ్ళు 18 వేల మందికి పై చిలుకు ఉన్నారు. లక్షల్లో పరిహారం పొందిన వారు ఉన్నారు.. తక్కువ వచ్చిన వారు కూడా ఉన్నారు.

 • పంటల బీమాను కంటి తుడుపు చర్యగా చేశారని చూపించే ప్రయత్నం చేయడం దిగజారుడు, దివాళాకారతనం. ఈ రెండింటితో టీడీపీ కొట్టుమిట్టాడుతుంది.
 • వాళ్ళు చేయలేకపోయినదాన్ని.. ముఖ్యమంత్రి జగన్ గారు క్రమం తప్పకుండా ఎలా ఇస్తున్నారని కడుపు మంటతో ఇలా వ్యవహరిస్తున్నారు.
 • ఉచిత పంటల బీమా పరిహారంపై ఈనాడులో కూడా ప్రకటన ఇచ్చాం. ఎవరైనా చెక్ చేసుకోవచ్చు.

రైతులతో రాజకీయం చేయడానికి టీడీపీకి సిగ్గు అనిపించడం లేదా..? కోవిడ్ కష్టకాలంలో కూడా ఉచిత పంటల బీమాను ప్రభుత్వం సొంతంగా, కంపెనీల భాగస్వామ్యం లేకుండా ఒక్కరోజే రూ. 1820 కోట్లు విడుదల చేయడం ఒక రికార్డు, రైతులకు ఇంత మంచి పని చేసినందుకు ఎవరైనా ప్రభుత్వాన్ని అభినందిస్తారు. కానీ టీడీపీ రైతులపైనా క్షుద్ర రాజకీయాలు చేస్తుంది.

 • ఈ ఒక్క నెలలోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా కింద రూ. 3,900 కోట్లు, నిన్న పంటల బీమా కింద రూ. 1820 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయింది. అంటే ఒక్క నెలలోనే మొత్తం రూ. 5,800 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉందా..?, అది ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వంలోనే సాధ్యమైంది.

వ్యవసాయ బడ్జెట్ విషయంలో కూడా కల్లబొల్లి కబుర్లు, అబద్ధాలు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం ఏదైతే రూపొందించిందో, వేరే రాష్ట్రాలు ఏ విధంగా అయితే బడ్జెట్ ప్రవేశపెడతాయో.. అలానే ఈ ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా చేసినట్టుగా, ఈ ప్రభుత్వం చేయనట్టుగా టీడీపీ నేతలు అబద్ధాలు, అసత్యాలు మాట్లాడుతున్నారు.

 • ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అన్నది కేవలం గైడ్ లైన్స్ కోసమే మేం ఉపయోగించుకున్నాం. ఆ నిబంధనలకు లోబడి ప్రభుత్వమే సొంతంగా అమలు చేస్తుంది.
  -ఈ సంవత్సరం వైయస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, ప్రతి రూపాయి రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఇచ్చింది.
 • ప్రధానమంత్రి ఫసల్ బీమా కిందగానీ, కేంద్రం ప్రీమియం వాటా గానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు.

పూర్తిగా వక్రీకరణలనే నమ్ముకుని టీడీపీ బతుకుతుంది. అధికారం పోయినా, టీడీపీ వక్రబుద్ధి పోవడం లేదు. నాకు బీమా డబ్బులు ఇప్పించండి అని రైతులు ఎవరి దగ్గరకు వెళ్ళి అభ్యర్థించకుండా.. ఒక స్విచ్ నొక్కితే డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం కేవలం ఒక్క ఈ ప్రభుత్వంలోనే జరుగుతుంది.

 • ప్రకృతి వైపరీత్యాల వల్ల గతంలో పంట నష్టపోతే సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీలు ఇవ్వని చరిత్ర చంద్రబాబుది.
 • ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 1038 కోట్లు గత ప్రభుత్వంలోని ఇన్ పుట్ సబ్సిడీ పాత బకాయిలను జగన్ గారు ఇచ్చారు.
 • గత ప్రభుత్వం ధాన్యం సేకరణ చేసి, రూ. 960 కోట్లు బాకీ పెడితే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఇచ్చాం.
 • విత్తనాలు కొని, సరఫరాదారులకు బకాయిలు పెడితే.. చంద్రబాబు పెట్టిన రూ. 384 కోట్లు బకాయిలను జగన్ మోహన్ రెడ్డిగారు తీర్చారు.
 • ఇవన్నీ రైతుల పట్ల టీడీపీకి ఎంత చిత్తశుద్ధి ఉందో, ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తున్నాయి.
 • ఆరోజు అధికారంలో ఉండి, వ్యవసాయానికి, రైతులకు బకాయిలు పెట్టి, ఈరోజు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు.

రూ. 87 వేల కోట్లు వ్యవసాయ రుణ మాఫీ అని చెప్పి, దానిని రూ. 15 వేల కోట్లు చేసి.. పులి వేషం వేసినట్టుగా చివరిలో కేంద్ర పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ అంటే రైతులు చంద్రబాబును, టీడీపీని ఛీ కొట్టారు. డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేయకుండా, చివరిలో పసుపు-కుంకుమ అంటే మహిళలు ఏం చేశారో చూశారు.

 • టీడీపీ స్థానం అక్కడే ఉంది… జగన్ మోహన్ రెడ్డిగారి స్థానం ప్రజల గుండెంల్లో ఉంది.
 • స్థానిక ఎన్నికల నుంచి తిరుపతి ఉప ఎన్నిక వరకు ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్ గారిని గుండెల్లో పెట్టుకున్నారు.

రాజకీయంగా దెబ్బతినడం వల్ల మీకు బాధ అనిపించవచ్చు. రైతుల విషయంలో రాజకీయం చేద్దామంటే కుదరదు.

 • వైయస్ఆర్ జలకళ పేరుతో ఉచితంగా బోర్లు వేసే పథకాన్ని ప్రారంభించాం. అయితే చెప్పిన హామీలే కాకుండా, చెప్పనివి కూడా అమలు చేస్తున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారు. బోర్లతో పాటు, రూ. 1700 కోట్లు పైచిలుకు ఖర్చుతో ఉచితంగా మోటార్లు ఇస్తామని జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ ఏడాది నుంచే అమలు చేయబోతున్నాం. చెప్పిన హామీలతో పాటు చెప్పనివి కూడా చేసి చూపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిదే.

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

2392 COMMENTS