Saturday, December 3, 2022

మంత్రుల్లో లబ్.. డబ్..!

ఈ రోజు జూన్ 8. రెండేళ్ళ క్రితం ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. మామూలుగా అయితే ఈ డేట్ కు పెద్దగా ప్రాధాన్యత ఏమీ ఉండదు. వాస్తవానికి, జగన్ మోహన్ రెడ్డి తన క్యాబినెట్ లోకి తీసుకున్న రోజే.. ఈ పదవులు రెండున్నరేళ్ళకే పరిమితం అని, పర్ఫార్మెన్స్ ను బట్టే విస్తరణ, కొత్త వారికి చోటు ఉంటుందని హింట్ ఇచ్చారు. జూన్ 8కి మంత్రుల పదవీకాలం రెండేళ్ళు పూర్తికావడంతో.. ఇక మిగిలింది నెలలు మాత్రమే. దీంతో క్యాబినెట్ మంత్రుల్లో లబ్ డబ్ మొదలైంది. క్యాబినెట్ మంత్రుల్లో ఎవరు ఉంటారో.. ఎవరు ఊడతారో.. జగన్ మోహన్ రెడ్డికే ఎరుక అన్నది జగమెరిగిన సత్యం.

మంత్రులుగా పదవీకాలం రెండేళ్ళు పూర్తైందన్న ఆనందం కంటే.. ఉన్న పదవి ఉంటుందో.. ఊడుతుందో… అన్న చర్చే మంత్రుల్లో ప్రధానంగా జరుగుతోంది.

నిజానికి జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రులుగా ఎంపికయ్యారేగానీ.. వీళ్ళు అధికారం అనుభవించింది, ఛలాయించిందీ చాలా తక్కువే. ఎందుకంటే, 2019 డిసెంబరు నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో.. అదే ఏడాది జూన్ లో కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వీళ్ళు, ఏతావాత ఆరు నెలలపాటే అధికారాన్ని అనుభవించారు. ఆ తర్వాత ఏడాదిన్నరగా కరోనా ఫస్ట్ వేవ్… సెకండ్ వేవ్.. రేపోమాపో థర్డ్ వేవ్ కూడా వస్తుందంటున్నారు.

చెప్పొచ్చేదేంటంటే, అధికారం అంటే ఛలాయించడానికి కాదని, అది కేవలం సేవ చేయడానికి మాత్రమే పరిమితం అని పదే పదే హిత బోధ చేసే జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలో.. వీళ్ళు అధికారం ఛలాయించారో లేక సేవ చేశారో ఆయనకే ఎరుక.

వై. పార్వతి

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...