Saturday, December 3, 2022

అర్థమవుతోందా బాబూ…!?

ప్రజలకు మంచి చేస్తే, సంపద సృష్టిస్తే ఓడిస్తారా.. హౌ..!? అంటూ చంద్రబాబు నాయుడు జూమ్ కాన్ఫరెన్స్ లో తెగబాధపడిపోతున్నారు.

తాను మాత్రం ఏ తప్పు చేయలేదు, ప్రజలే టీడీపీని ఓడించి తప్పు చేశారన్నట్టుగా ఆయన జూమ్ మాటలు ఉన్నాయి. ప్రజలు అధికారం నుంచి దించేసి రెండేళ్ళు పూర్తైనా, ఎందుకు ఓడించారో ఆయనకు ఇప్పటికీ అర్థం కావడం లేదట.

అసలు బాబు చేసిన నేరం ఏంటి..? ప్రజలు ఎందుకు టీడీపీని 23 స్థానాలకు పరిమితం చేశారు..? అంటే జన్మభూమి కమిటీల నుంచి గ్రాఫిక్స్ కే పరిమితమైన అమరావతి వరకు బోలెడన్ని కారణాలు చెప్పొచ్చు. చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో వారికే బాగా తెలుసు కాబట్టి, ఈ సోది అంతా ఇప్పుడు రిపీట్ చేయాల్సిన పని లేదు.

పోనీ, పదికాలాలపాటు గుర్తుండిపోయే విధంగా విభజిత రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన మంచి ఏదైనా ఉందా.. అంటే అన్న క్యాంటీన్లు, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలు మినహా గుర్తు పెట్టుకునేందుకు ప్రజలకు పెద్దగా ఏమీ కనిపించడం లేదు.

చంద్రబాబు కలల రాజధాని అమరావతిలో నవ నగరాలు, ఐకానిక్ బ్రిడ్జిలు, బుల్లెట్ ట్రైన్లు.. సంగతి దేవుడెరుగుకానీ, ఆయన నిర్మించిన సెక్రటేరియేట్, అసెంబ్లీ, హైకోర్టుకి వెళ్ళేందుకు సరైన రహదారి కూడా ఏర్పాటు చేయకుండానే దిగిపోయారు. కనీసం ఇటువంటి మౌలిక సదుపాయాలు అన్నా పూర్తి అయి ఉంటే, ఒక ఆకారం అన్నా వచ్చి ఉండేది. హైటెక్ సిటీని కట్టి సైబరాబాద్ ను తానే నిర్మించానని చెప్పినట్టుగా, చంద్రబాబు అమరావతిని నిర్మించాడని చెప్పుకునే వాళ్ళు. అదీ లేకపోయే..!

ప్రజాస్వామ్యంలో నేతల తలరాతలు మార్చేది ప్రజలే. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయినా.. 40 ఇయర్స్ నాయకుడా.. అన్నది ప్రజలకు అనవసరం. చంద్రబాబు రాజకీయ అనుభవం 2014లో అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే, 2019లో ఆ అనుభవాన్ని పక్కన పెట్టి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగిన నాలుగు పదుల యువ నాయకుడు జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు అధికారం కట్టబెట్టారు.

సో.. ఇప్పటికైనా అర్థమైందనుకుంటా..!

వై. పార్వతి

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...