Saturday, December 3, 2022

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం చెబుతుంటే.. రెండేళ్ళలో విధ్వంసం, కక్ష సాధింపులే అధికంగా ఉన్నాయని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపిస్తోంది.

జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజలకు డబ్బులు పంచిందీ నిజం. అచ్చెన్నాయుడు నుంచి ధూళిపాళ్ళ నరేంద్ర వరకు.. టీడీపీ నేతలపై అవినీతి కేసులు పెడుతున్నదీ నిజమే. అవినీతి చేయకపోతే కేసులు ఎందుకు పెడతామని అధికారపక్షం అనటం, మేం చేసింది అవినీతి కానేకాదు, లోక కళ్యాణం కోసమే చేశామని ప్రతిపక్షం ఎదురుదాడి చేయడం రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. ఇవన్నీ తేలేదెప్పుడు… అప్పటి వరకు బతికేది ఎవరు, చచ్చేది ఎవరు, ఏ పార్టీలో ఎవరు ఉంటారో కూడా అంత ఈజీగా చెప్పలేం.

రాజకీయాల్లో కక్ష సాధింపులు అనేవి కొత్తేమీ కాదు. ఇదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు..? రాజకీయ ప్రత్యర్థులపై ఏమైనా ప్రేమ కురిపించాడా..? అంటే లేదు. ఆయన చేసిందీ కక్ష సాధింపులే. ఇప్పుడు జరుగుతున్నవే దాదాపు అవే. ఎవరూ మినహాయింపు కాదు.

అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన టీడీపీ ముఖ్య నేతల లీక్ వీడియోలు తెహల్కా లీక్ లు అంత కాకపోయినా.. ఆ పార్టీలో ఒకింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. పార్టీనా, బొక్కా.. అన్నఅచ్చెన్నాయుడు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు పార్టీకి దూరమవుతున్నారన్న సోమిరెడ్డి మాటలు, వాటికి తేనె పూస్తున్న చంద్రబాబు వీడియోలు పార్టీని బాగా డ్యామేజ్ చేస్తున్నాయి.

మరోవైపు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తైనా… ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఇంతవరకు స్పష్టత లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిలోనే రాష్ట్ర ప్రజలు ఉన్నారు. అమరావతి వద్దనుకున్నారు సరే.. మరి మూడు రాజధానుల జగన్ మోహన్ రెడ్డి కల ఎప్పటికి పూర్తవుతుందో..!? కూడా ఇప్పుడిప్పుడే చెప్పే పరిస్థితి లేదు. ఒకవైపు కరోనా.. మరోవైపు న్యాయస్థానాలు.. రాజధానుల వికేంద్రీకరణకు అడ్డంకిగా మారాయి.

ఎప్పుడూ విజన్ 2020.. 2050 అంటూ వర్తమానాన్ని వదిలి భవిష్యత్తు మీదే ఆశలు పెట్టుకునే చంద్రబాబు ఆంధ్రాలో కంటే హైదరాబాద్ లోనే సేఫ్ అనుకుంటున్నారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై కుమ్మరిస్తున్న వేల కోట్ల డబ్బులే మళ్ళీ బంగారు పళ్ళెంలో అధికారాన్ని తెచ్చిపెడతాయని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికింతే.. రేపు ఏం జరుగుతుందో చూద్దాం..!

వై. పార్వతి

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...