వైఎస్ షర్మిల: ఇది బంగారు తెలంగాణ కాదు ..అప్పుల తెలంగాణ…
కరీంనగర్ జిల్లా పర్యటనలో వైఎస్ షర్మిల బిజీ బిజీగా గడిపారు. కరోనాతో ప్రజలందరూ ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా బాధలు అనుభవిస్తుంటే.. మరో పక్క థర్డ్ వేవ్ వస్తాదనే భయంలో ఉండగా ఇప్పుడు ఇప్పుడు కెసిఆర్ స్కూల్స్ ఎందుకు ఓపెన్ చేయిస్తున్నారు అని ప్రశ్నించారు. పేదల పాలిట వరం ఆరోగ్య శ్రీ.. ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘటన వైఎస్ఆర్‌దేనని చెప్పారు. అలాంటి ఆరోగ్యశ్రీ లో కరోనా ను ఎందుకు చేర్చుకోవడం లేదని అడిగారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ కరోనా వలన ఎందరో అప్పులపాలు అయ్యారు. హాస్పిటల్స్ లో లక్షలకు లక్షలు లాగుతుంటే సామాన్యుడు ఇల్లు వాకిలి అన్ని తాకట్టు పెట్టు డబ్బు తెచ్చి ఇస్తే, చివరికి శవాన్ని చేతులో పెడుతున్నారు అని అన్నారు.
ఆయుష్ మాన్ భారత్ దిక్కుమలింది అని కేసీఆర్ పదే పదే పాలికేవారన్నారు. ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి పేద వాడి కన్నీళ్లు చూడాలని షర్మిల కోరారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని కోరారు. ఎన్నికల పైన ఉన్న సోయి పేద ప్రజల ప్రాణాలపైన లేదా అడిగారు. వైస్సార్ గొప్ప గురించి అందరికి తెలుసు అని.. అతని గురించిమాట్లాడే హక్కు మీకు లేదన్నారు. ఖబడ్దార్ కెసీర్.. ఇది బంగారు తెలంగాణ కాదు ..అప్పుల తెలంగాణ అని ఫైరయ్యారు.