Tuesday, August 9, 2022

వామ్మో, ఈ కాయిన్ ధర రూ. 142 కోట్లంట! ఎందుకో తెలుసా?

వామ్మో, ఈ కాయిన్ ధర రూ. 142 కోట్లంట! ఎందుకో తెలుసా?

దేని విలువ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమని తెలుసు గాని, అసలు ఊహకందనంతగా ఉంటుందా అనేది మాత్రం ఊహించలేము. కాయిన్ ధర అన్ని కోట్లు ఏమిటి అనుకుంటున్నారా? అది గోల్డ్ కాయిన్ లెండి. అయినా గోల్డ్ కాయిన్ అయినా కూడా, మహా ఉంటె వేళల్లో లేదా లక్షల్లో ఉంటుంది కానీ, అన్ని కోట్లు ఎందుకు ఉంటుంది అని మీకు కూడా అనుమానం వస్తుంది కదా. వస్తాది ఎందుకంటే 142 కోట్లు అంటే మామూలు మాట కాదు కదా… డబుల్ ఈగల్ కాయిన్ ను మంగళవారం (జూన్ 8,2021) వేలం వేయగా భారీగా ధరకు అమ్ముడుపోయింది.
ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ స్టువార్ట్‌ వీట్జమన్‌కు చెందిన ఈ డబుల్ ఈగల్ నాణేన్ని వేలం వేశారు. 20 డాలర్ల ఈ బంగారు నాణేలను 1933లో తయారుచేసినా… తీవ్ర ఆర్థిక మంద్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాటి యూఎస్ ప్రెసిడెంట్ రూజ్‌వెల్ట్‌ డబుల్‌ ఈగల్‌ నాణేలను చలామణికి విడుదల చేయకుండా నిలిపివేశారు. అనంతరం ఈ నాణాలను కరిగించమని ఆదేశించారు.
ఆనాడు బయటికి వచ్చి రెండు నాణాలలో ఈ డబుల్ ఈగల్ నాణెం ఒకటిగా ఉంది. డబుల్‌ ఈగిల్‌ కాయిన్ పై ఒకవైపు లేడీ లిబర్టీ, మరో వైపు అమెరికన్‌ ఈగిల్‌ బొమ్మలు ముద్రించి ఉన్నాయి. 1794కు చెందిన ‘ఫ్లోయింగ్‌ హెయిర్‌’ వెండి నాణేం 2013లో 73 కోట్లకు అమ్ముడుపోయి అత్యధిక ధర పలికిన నాణేంగా రికార్డులకెక్కగా ఆ రికార్డును డబుల్‌ ఈగిల్‌ కాయిన్ తుడిచిపెట్టేసి రూ.142 కోట్లు పలికి మరో కొత్త రికార్డును క్రియేట్ చేసింది.

Related Articles

ఈ టాయిలెట్ వాడితే డబ్బులు అడక్కపోగా, తిరిగి ఇస్తారంట!

ఈ టాయిలెట్ వాడితే డబ్బులు అడక్కపోగా, తిరిగి ఇస్తారంట!సాధారణంగా మనం ఎక్కడికైనా బయటకు వెళ్తే, అక్కడ అందుబాటులో ఉన్న టాయిలెట్ ని వాడతాం. టాయిలెట్ బయట ఒక వ్యక్తి కూర్చుని...

ఇంట్లో ఖాళీస్థలం ఉంటె, దీని మీద దృష్టి పెడితే ఖర్చుతగ్గటంతో పాటు… మహాభాగ్యం కూడా…

ఇంట్లో ఖాళీస్థలం ఉంటె, దీని మీద దృష్టి పెడితే ఖర్చుతగ్గటంతో పాటు… మహాభాగ్యం కూడా… ఈరోజుల్లో ఆరోగ్యం ఎంత బాగుంటే అంత భాగ్యం కలిగి ఉన్నట్టు....

భారత్‌-శ్రీలంక సిరీస్ లో కీలక నిర్ణయం…

భారత్‌-శ్రీలంక సిరీస్ లో కీలక నిర్ణయం… 13న జరగాల్సిన వన్డే సిరీస్‌ను 18వ తేదీ నుంచి జరపనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా పీటీఐకు తెలిపారు. జులై...

411 COMMENTS