Friday, September 29, 2023

వాట్సాప్ లో ఈ మార్పు వలన మీకేమైనా నష్టమా?

వాట్సాప్ లో ఈ మార్పు వలన మీకేమైనా నష్టమా?

ఈరోజుల్లో ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఎదుకంటే ఫోన్ లేకపోతే ప్రపంచం మొతానికి దూరంగా ఉన్నట్టు, ఫోన్ చేతిలో ఉంటె ప్రపంచం మొత్తం వారి చేతిలో ఉన్నట్టు ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది. అందులోనూ ఇప్పుడు వాట్సాప్ తో చాలాబాగా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే పర్సనల్ గా ఒకరితో ఒకరు చాటింగ్ చేసుకోవడానికి, వీడియో కాల్స్, ఫొటోస్ మరియు వీడియోలు తీసి పంపడానికి ఇలా ఎన్నో ఉపయోగాలకు వాట్సాప్ ఉపయోగపడుతున్న విషయం తెలిసిందే. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ తో అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మరో అప్డేట్ తో ముందుకు రాబోతుంది.
తాజాగా వాట్సాప్‌ తన యూజర్లకు మరొ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్‌ కొత్తగా ‘వ్యూ వన్స్‌’ అనే సరికొత్త మోడ్‌ను యూజర్లకు అందించనుంది. సాధారణంగా వాట్సాప్‌లో యూజర్‌ వీడియోను, ఫోటోలను పంపితే రెసిపెంట్‌ (గ్రహీత) యూజర్‌ వాటిని చూడగల్గుతాడు. కాగా వీడియోలు, ఫోటోస్‌ ఒక్కసారి రెసిపెంట్‌ యూజర్‌ డౌన్‌లోడ్‌ చేశాక ఎల్లప్పుడు మొబైల్‌లోనే స్టోర్‌ అవుతాయి. రెసిపెంట్‌ తిరిగి యూజర్‌ పంపిన సమాచారాన్ని చూసుకోగలడు.
ప్రస్తుతం వాట్సాప్‌ తెచ్చిన ‘వ్యూ వన్స్‌’ మోడ్‌తో మెసేజ్‌ పంపితే ఇకపై అలా జరగదు. వాట్సాప్‌ తెచ్చిన ‘వ్యూ వన్స్‌’ మోడ్‌తో.. ఒకసారి పంపిన వీడియో, ఫోటో, మెసేజ్‌లను రెసిపెంట్‌ యూజర్‌ కేవలం ఒక్కసారి మాత్రమే చూడటానికి వీలు పడుతుంది. తరువాత ఆ మెసేజ్‌లను రెసిపెంట్‌ చూడటానికి వీలుండదు. దీంతో యూజర్‌ పంపిన ఫోటో, వీడియో, మెసేజ్‌లను రెసిపెంట్‌ యూజర్‌ చూడటానికి నియంత్రించే అవకాశం ఏర్పడుతుంది.

వాట్సాప్ ని వ్యాపారాలకు కూడా మంచి ప్లాట్ఫార్మ్ గా వాడతారు. అలాంటివారికి ఈ ఆప్షన్ వలన ఏమైనా ఇబ్బంది ఉండొచ్చేమో. అనేకమంది, వాట్సాప్ ద్వారా అనేక వస్తువులు మార్కెటింగ్ చేస్తూ, అమ్ముకుంటారు. అలాంటిది ఇప్పుడు ఇమేజస్, మెస్సేజెస్ వెంటనే పోతాయి అంటే… మరి దీనిపై ఆధారపడేవారికి ఏమైనా నష్టం ఉంటుందేమో లేదా వేరే ఆప్షన్ ఉంటుందో చూడాలి…

Related Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

425 COMMENTS