Friday, September 29, 2023

వాక్సిన్ తీసుకోని వారికే ఎక్కువగా దీని బారిన పడే ప్రమాదం ఉందట. డబ్ల్యూ హెచ్ వో హెచ్చరిక…

వాక్సిన్ తీసుకోని వారికే ఎక్కువగా దీని బారిన పడే ప్రమాదం ఉందట. డబ్ల్యూ హెచ్ వో హెచ్చరిక…

కరోనా మొదటి వేవ్ అయ్యింది. సెకండ్ వేవ్ వచ్చి అది కూడా చివరి దశకు వస్తుంది. అయితే ఇప్పుడు రెండు ప్రమాదాలు ఇంకా ముందున కనిపిస్తున్నాయి. థర్డ్ వేవ్ మరియు డెల్టా వేరియంట్. ఇక ఈ రెంటిని ఎదుర్కోవలసిన సమయం వచ్చేస్తుంది. ఏడాది పైగా కరోనాతో పోరాడి పోరాడి ఉన్న ప్రపంచం మళ్ళి ఈ రెండిటిని ఎదుర్కోవడం అంటే, కష్టమే గాని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జాగ్రత్తగా బయటపడవచ్చు.
ఆల్ఫా వేరియంట్ తర్వాత డెల్టా వేరియంటే అత్యంత ప్రమాదకరమని డబ్ల్యూహెచ్ఓ కొవిడ్ టెక్నికల్ హెడ్ డాక్టర్ మరియా వాన్ తెలిపారు. వ్యాక్సిన్ వేసుకోని వారికి దీని నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుందన్నారు. వేరియంట్ ఏదైనా దాని వ్యాప్తిని, తీవ్రతను తగ్గించడంలో టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని మరియా వివరించారు. వ్యాక్సిన్లు తీసుకున్నా మాస్కులు మస్ట్ అంటోంది డబ్ల్యూహెచ్ వో. కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో చాలా దేశాలు ఇటీవల కరోనా నిబంధనలు సడలిస్తున్నాయి. దీంతో కేసులు మళ్లీ పెరుగుతున్నాయని అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ మరింతగా రూపాంతరం చెందే అవకాశం ఉందని హెచ్చరించారు. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం ద్వారా కొత్త వేరియంట్లు రాకుండా నిరోధించవచ్చన్నారు. వాక్సిన్ వేసుకున్నవారు కూడా తప్పనిసరిగా కరోనా నియమాలను పాటించాలి…

Related Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

398 COMMENTS