Saturday, December 3, 2022

లక్ష రూపాయలను పిల్లి ఎలా కాల్చేసిందో చూడండి…

లక్ష రూపాయలను పిల్లి ఎలా కాల్చేసిందో చూడండి…

ఈరోజుల్లో డబ్బు సంపాదించడం ఎంతో కష్టంగా ఉంది. సంపాదించిన దానిని నిలబెట్టుకోవడం ఇంకా కష్టంగా ఉంది. మరో పక్క ఖర్చలు కూడా ఎక్కువ అయిపోయాయి. ఇకపోతే రైతు ఒక లక్షరూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అలాంటిది ఒక పిల్లి వలన లక్ష రూపాయలు పోగొట్టుకుంటే ఎంత బాధగా ఉంటాది.జోగుళాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం నందిన్నెకు చెందిన రైతు తెలుగు వీరేష్‌ తనపొలంలో యాసంగిలో వరి సాగు చేశాడు.
చేతికొచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయిం చాడు. దీనికి సంబంధించి ఈ నెల 1న బ్యాంకు ఖాతాలో రూ.లక్ష జమయ్యాయి. శనివారం డబ్బు లు డ్రా చేసి బట్టలో చుట్టి గుడిసెలోని సంచిలో భద్రపరిచాడు. ఈ నేపథ్యంలో సోమవారం దేవుడి పటాల ముందు పూజ చేసి హారతి ఇచ్చాడు. అయితే అక్కడికి వచ్చిన ఓ పిల్లి హారతికి తగలడంతో గుడిసెలో మంటలు వ్యాపించాయి. మంటలు ఆర్పేసి నప్పటికీ అప్పటికే దాచుకున్న రూ.లక్ష నగదు దగ్ధమయ్యాయి. పంట పెట్టుబడికి ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద నుంచి తెచ్చిన రూ.50 వేల అప్పు తీరుద్దాం అని భావించే లోపే ఈ ప్రమాదం జరగడంతో బాధిత రైతు వీరేష్‌ ఆవేదన చెందుతున్నాడు.

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

201 COMMENTS

Comments are closed.

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...