Tuesday, December 6, 2022

మళ్ళి మొదలైన ఆ యాప్! యూజర్లలో ఒకటే జోరు, హుషారు…

మళ్ళి మొదలైన ఆ యాప్! యూజర్లలో ఒకటే జోరు, హుషారు…
టిక్‌టాక్‌కు పాకిస్థాన్‌లో విశేష ఆదరణ ఉంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో వస్తువులు విక్రయించేవారు ఎక్కువగా టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారు. అయితే, ముస్లిం దేశమైన పాకిస్థాన్‌లో టిక్‌టాక్ వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. అభ్యంతరకర, స్వలింగ, ట్రాన్స్‌జెండర్ కంటెంట్‌ను ప్రమోట్ చేస్తోందన్న అభియోగాలు టిక్‌టాక్‌పై ఉన్నాయి. అభ్యంతరకర వీడియోల ఆరోపణలతో పాకిస్థాన్‌లో ఇప్పటికే టిక్‌టాక్ రెండుసార్లు నిషేధానికి గురైంది.ఈ యాప్‌పై ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌ను సింధ్ కోర్టు విచారించింది. అనంతరం కోర్టు తీర్పుతో పాకిస్థాన్ టెలికం అథారిటీ (పీటీఏ) టిక్‌టాక్ యాక్సెస్‌ను గురువారం మూడోసారి బ్లాక్ చేసింది. గత మూడు నెలల కాలంలో అభ్యంతరకరంగా ఉన్న ఆరు మిలియన్లకుపైగా వీడియోలను తొలగించినట్టు బుధవారం టిక్‌టాక్ పేర్కొంది. వీటిలో 15 శాతం అడల్ట్, న్యూడిటీ, సెక్సువల్ కంటెంట్‌ ఉందని పేర్కొంది. కాగా, టిక్‌టాక్‌పై ఉన్న నిషేధాన్ని శుక్రవారం కోర్టు ఎత్తివేయడంతో శనివారం నుంచి మళ్లీ దాని సేవలు మొదలయ్యాయి. దీంతో యూజర్లలో జోష్ మళ్లీ మొదలైంది.

Related Articles

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

426 COMMENTS