పెంచిన స్కూల్ ఫీజులు, చస్తే చావండి అంటున్న మంత్రి! అసలు విషయం ఏమిటంటే…
మధ్యప్రదేశ్ లోని మహాసంఘ్ కు చెందిన విద్యార్థుల 80 మంది పేరెంట్స్ విద్యాశాఖ మంత్రి అధికార నివాసానికి వెళ్లారు. చాలా స్కూళ్లు.. అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, స్కూల్స్ కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలని ఆల్రెడీ కోర్టు తీర్మానించిందని ఫిర్యాదు చేశారు. ఇలాంటి కరోనా కష్టకాలంలో ఫీజులు పెంచడం న్యాయం కాదని ఎంత అర్థిస్తున్నా స్కూల్ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని, మీరైనా ఏదైనా చర్య తీసుకోండి అని ప్రజలు వేడుకోగా… విసుగ్గా ‘వెళ్లి చావండి, మీకిష్టమైంది చేసుకోండి’ అంటూ తిట్టిపోసారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్.
మంత్రి కామెంట్లకు అసలే ఆగ్రహంతో ఉన్న పేరెంట్స్ కు ఆవేశం తోడై ఆయన ఇంటి ముందే దురుసుగా మాట్లాడిన మంత్రి రాజీనామా చేయాలంటూ ధర్నాకు దిగారు. దీనిపై మీడియాతో మాట్లాడిన మంత్రి పేరెంట్స్ కు క్షమాపణ కోరుతున్నానని.. పేరెంట్స్ అడిగినట్లు చేయలేకపోతే రాజీనామా చేస్తానంటూ హామీ ఇచ్చారు.