Tuesday, October 4, 2022

నిజంగా ఇది బాధాకరం అంటున్న రోజా…

నిజంగా ఇది బాధాకరం అంటున్న రోజా…
జూలై 02వ తేదీ శుక్రవారం తిరుపతికి ఎమ్మెల్యే రోజా చేరుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్ని నీటి వివాదం విషయంలో…కేంద్ర జలవనరుల శాఖ మంత్రి జోక్యం చేసుకుని ప్రాంతీయ విధ్వేషాలు ఏర్పడకుండా చూడాలన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రాష్ట్రానికి అన్యాయం చేయాలనుకుంటే సీఎం జగన్ సహించరన్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటా ఇవ్వకుండా అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. తెలంగాణకు చేతులెత్తి దండం పెడుతున్నా..నీటిని విద్యుత్ తయారీకి వాడుకుని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని మహిళలకు అన్యాయం చేయొద్దన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య జలవివాదం ఏర్పడడం బాధాకరంగా అభివర్ణించారు.

Related Articles

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

381 COMMENTS

Comments are closed.