Saturday, December 3, 2022

దేవుడా!ఈ ద్రాక్ష గుత్తి ధర రూ.7.5 లక్షలు, ఎందుకో తెలుసా?

దేవుడా!ఈ ద్రాక్ష గుత్తి ధర రూ.7.5 లక్షలు, ఎందుకో తెలుసా?

ద్రాక్షపండు ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనకు బాగానే తెలుసు. కానీ అది మనం కొనొక్కేలేని స్థితికి ఆకాశానికి ధరలు పెరుగుతున్నాయని ఎంత అనిపించినా మరీ ఇంత దారుణమైన ధర ఎప్పుడు ఎక్కడా చూడలేదు కదా…సాధారణంగా మనకు తెలిసి కిలో ద్రాక్ష 70 లేదా 120 రూపాయలు ఉంటుంది. కానీ ఇవి ఖరీదో చూడండి. ఎర్రని ద్రాక్ష గుత్తి ధర మాత్రం 11 వేల డాలర్లు. భారత కరెన్సీలో అక్షరాల రూ.7.5 లక్షలు. ఏంటి షాక్ అయ్యారా? కానీ ఇది నిజం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షగా అది రికార్డు నమోదు చేసింది. వేలంలో భారీ రేటుకు అమ్ముడుపోయింది.

జపాన్‌కు చెందిన ఓ కంపెనీ ఈ ద్రాక్ష గుత్తిని వేలంలో గెలుచుకుంది. దీనికి రూ.11 వేల డాలర్లను చెల్లించింది. ఈ గుత్తిలో మొత్తం 24 ద్రాక్ష పండ్లు ఉన్నాయి. ఒక్కో పండు బరువు 20గ్రాములపైనే ఉంది. ఈ ద్రాక్ష పండ్లను మార్కెట్లో ప్రవేశపెట్టిన గత 11 ఏళ్లలో ఎన్నడూ ఇంత ధర పలకలేదని నిర్వాహకులు తెలిపారు.ధరకు తగినట్లే ఈ ద్రాక్ష పండ్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయని రైతులు చెబుతున్నారు. చాలా తియ్యగా, అతి తక్కువ ఆమ్లత్వంతో, రసాలు నిండి ఉంటాయని తెలిపారు. సాధారణ రోజుల్లో ఈ ద్రాక్ష గుత్తి ధర 460 డాలర్లు (రూ.31,537) వరకు ఉంటుందన్నారు. వీటిని ఎక్కువగా ఇతరులకు బహుమతిగా ఇచ్చేందుకు కొనుగోలు చేస్తారన్నారు.

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

335 COMMENTS

Comments are closed.

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -