Friday, September 29, 2023

థర్డ్ వేవ్ ఈ రూపంలో వస్తే ప్రమాదమే అంటున్న నిపుణలు. ఇప్పటికే ఈ నాలుగు రాష్ట్రాలలో మొదలయ్యింది…

థర్డ్ వేవ్ ఈ రూపంలో వస్తే ప్రమాదమే అంటున్న నిపుణలు. ఇప్పటికే ఈ నాలుగు రాష్ట్రాలలో మొదలయ్యింది…
కరోనా సెకండ్ వేవ్ భారతదేశాన్ని ఎంతగా వణికించిందో మనందరికీ తెలుసు. ఇపుడు థర్డ్ వేవ్ రాబోతుందని అందరూ భయంలో ఉన్నారు. అది ఎలా వస్తుందో దానిని ఎలా ఎదుర్కోవాలో అనే ఆందోళనలో ఉంది దేశం.కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ డెల్టా ప్లస్ కోవిడ్ వేరియంట్ భారత్ లో కోవిడ్ మూడో దశకి ప్రధాన కారణం అయ్యే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇది మన దేశంలో నాలుగు రాష్ట్రాలకు విస్తరించింది.

మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌, కర్ణాటకలో ఈ వేరియంట్ విస్తరించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించగా మహారాష్ట్రలో అత్యధికంగా ఇప్పటివరకు 21 డెల్టాప్లస్ కేసులను గుర్తించారు. ఈ వేరియంట్‌తోనే ఇప్పుడు అక్కడ మూడోముప్పు పొంచి ఉందని ఆరోగ్యశాఖ ఇదివరకే అంచనా వేసింది.డెల్టాప్లస్ రూపంలో థర్డ్ వేవ్ వస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేదానిపై ఇప్పుడు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డెల్టాప్లస్ వేరియంట్ మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ఔషధాన్ని ఏమారుస్తుందనే నివేదికలు ఆందోళన కలిగిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ హెచ్చరించింది.

Related Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

Stay Connected

22,046FansLike
0FollowersFollow
21,200SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..