Tuesday, October 4, 2022

టీమిండియాకు భారీ షాక్‌..ఇది నిజమేనా?

టీమిండియాకు భారీ షాక్‌..ఇది నిజమేనా?
ఈ నెల 18 నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ల మధ్య డబ్యూటీసీ ఫైనల్ ప్రారంభం కానుండగా.. టీమిండియా ఆటగాళ్లు ప్రిపరేషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఫైనల్‌కు ముందు ఎటువంటి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ లేకపోవడంతో ఆటగాళ్లంతా నెట్స్‌లోనే తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు సౌతాంప్టన్‌లోని మేఘావృతమైన వాతావరణానికి అలవాటు పడేందుకు జట్టు సభ్యులు ఎక్కువ సమయాన్ని గ్రౌండ్‌లోనే గడుపుతున్నారు.

అయితే ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు టీమిండియాకు ఆందోళన కలిగించే వార్త వెలువడింది. గురువారం నెట్‌ ప్రాక్టీస్‌ సందర్భంగా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయపడినట్లు తెలుస్తుంది. నెట్స్‌లో పేసర్ మహ్మద్ షమీ విసిరిన బౌన్సర్‌ కోహ్లీ పక్కటెముకలను తీవ్రంగా గాయపరిచిందని, దీంతో అతను మూడు నుంచి ఆరు వారాల పాటు క్రికెట్‌కు దూరం కావాల్సి వస్తుందని జాతీయ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ కోహ్లీకి గాయం నిజమే అయితే, అది టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బేనని క్రికెట్‌ పండితులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,100SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...

ఇంట కాస్త తగ్గినా, రచ్చ గెలిచిన ప్రధాని మోడీ…

ఇంట కాస్త తగ్గినా, రచ్చ గెలిచిన ప్రధాని మోడీ…దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా క్రమంగా తగ్గుతోందని అమెరికాకు చెందిన డేటా ఇంటలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ చెబుతోంది. 2019...