చెప్పుల దండ వేసి, మూత్రంలో ముంచి మరీ ఊరేగించారు. అసలు కారణం ఏమిటంటే…
ఒక యువకుడికి చెప్పుల దండ వేసి, ఊర్లో అందరి మూత్రంలో ముంచి, ఊరేగించి పోలీసులకు అప్పగించారు. వింటే ఇంత దారుణంగా శిక్షలు ఉంటాయా అని అనిపిస్తుంది. కానీ ఆ యువకుడు చేసిన పని కూడా అంతే వరెస్ట్ గా ఉంది.భిల్వారా జిల్లాలోనిథాలియో కా ఖేడా గ్రామంలో ఓ యువకుడు ఊరిలో జులాయిగా తిరుగుతూ అమ్మాయిలను వేధిస్తుంటాడు. కంటికి కనిపించిన యువతుల వెంట పడి అసభ్యంగా మాట్లాడుతూ..వేధిస్తుంటాడు. ఈక్రమంలో గత శనివారం (జూన 20,2021) రాత్రి ఒక ఇంట్లోకి దూరి ఒంటరిగా ఉన్న అమ్మాయిని అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురిచేశాడు. అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆ యువతి పెద్దగా కేకలు వేయటంతో చుట్టుపక్కలవారు వచ్చి అతడిని పట్టుకున్నారు.
ఆ తరవాత ఆ ఊర్లో మరి కొందరు ఆ యువకుడి గురుంచి చెప్పుకుంటూ వచ్చారు. వయసుతో కూడా సంబంధం లేకుండా, ఆడవాళ్ళతో చాల అసభ్యంగా ప్రవర్తిస్తాడని అనేకమంది చెప్పారు. దానితో ఆ ఊరి సర్పంచు విధించిన శిక్ష ప్రకారం, అతడి మెడలో చెప్పుల దండ వేసి..గ్రామస్తుల మూత్రంతో స్నానం చేయించి ఊరంతా ఊరేగించి పోలీసులకు అప్పగించారు. ఈక్రమంలో అతడి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టటంతో అవికాస్తా వైరల్ అయ్యాయి. ఇంకెప్పుడు ఎక్కడా కూడా ఆడవారితో ఇలా ప్రవర్తించకూడదనే ఇలా బుద్ది చెప్పి, పోలీసులకు అప్పగించామని ఆ ఊరి సర్పంచు తెలిపారు.