Saturday, December 3, 2022

గాలిలో తేలుతున్న బండరాళ్లను ఎప్పుడైనా చూసారా? ఇదిగో స్వయంగా చూడండి. ఎలా తేలుతున్నాయంటే..

గాలిలో తేలుతున్న బండరాళ్లను ఎప్పుడైనా చూసారా? ఇదిగో స్వయంగా చూడండి. ఎలా తేలుతున్నాయంటే..

హైదరాబాద్ లోని మోజంజాహీ (ఎంజే) మార్కెట్ జంక్షన్ రోడ్ లో ఓ రాతి శిల్పం కొత్త అట్రాక్షన్ గా నిలిచింది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. ఆ శిల్పం రెండు రాళ్లు గాల్లో తేలుతున్నట్లుగా చెక్కారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) దీనిని ఏర్పాటు చేసి బాటసారులను ఆశ్చర్యపరుస్తోంది.
చాలా మందికి అసలు విషయం తెలియక కళ్లప్పగించి చూస్తున్నా.. ఎవరికీ అర్థం కావడం లేదు. విదేశాల్లో కనిపించే ఇలాంటి టెక్నిక్ హైదరాబాద్ లో కూడా కనిపిస్తుండటం మరింత మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి వాటిని అతికించరు. ఎటువంటి మాయాజాలం కూడా వాడలేదు అని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఇంజినీర్ కొడిదల్ వెంకట్ నారాయణ అంటున్నారు.
సిటీలో ఉండే అకల్ప్ ముకీమ్ అనే వ్యక్తి శిల్పం గురించి ఇలా అంటున్నారు. ఈ శిలలు గాల్లో తేలుతున్నట్లు ఉండటానికి సీక్రెట్.. అవి ఫైబర్, గ్లాస్ మెటేరియల్ తో పాటు స్టీల్ పైప్ తో నిర్మించారు. అవి సపోర్టింగ్ నిలబడటంతో రెండు పెద్ద బండరాళ్లను గాల్లో తేలుతున్నట్లుగా కనిపిస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేయడంతో అచ్ఛం బండరాళ్లలాగే కనిపిస్తున్నాయి.
ఇదంతా డిజైనింగ్ లో ఉన్న టెక్నిక్సేనని ఈ మొత్తం రెడీ చేయడానికి దాదాపు 20రోజుల సమయం పట్టిందని చెబుతున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే ఎమ్జే మార్కెట్ ప్రాంతంలో ఇది మరో అట్రాక్షన్ గా నిలిచింది.

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

620 COMMENTS