Saturday, December 3, 2022

కరోనా వలన ఐపిఎల్‌ టోర్నీకి విరామం చెబుతున్న ఆటగాడు…

కరోనా వలన ఐపిఎల్‌ టోర్నీకి విరామం చెబుతున్న ఆటగాడు…

ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున ఆడుతున్న ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐపిఎల్‌ టోర్నీ నుంచి విరామం తీసుకుంటున్నట్లు సోమవారం ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ల మధ్య ఆదివారం మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగా సాగిన విషయం విదితమే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయాన్ని సాధించింది. మ్యాచ్‌ అనంతరం అశ్విన్‌ తన విరామ నిర్ణయాన్ని ప్రకటించారు.
ట్విట్టర్‌లో అశ్విన్‌ మాట్లాడుతూ… ‘ నా కుటుంబ సభ్యులు కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు. కాబట్టి ఈ కష్టకాలంలో నేను వారికి అండగా ఉండాలనుకుంటున్నాను. అందుకే ఈ ఐపిఎల్‌ సీజన్‌కు రేపటి నుంచి విరామం పలుకుతున్నాను. ఒకవేళ పరిస్థితులు కుదుటపడితే మళ్లీ ఆడేందుకు తిరిగొస్తా. ధన్యవాదాలు ‘ అని అశ్విన్‌ పేర్కొన్నారు.
అశ్విన్‌ ట్వీట్‌పై అధికారికంగా స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ‘ ఈ ఆపద సమయంలో అశ్విన్‌ కుటుంబానికి మా సహకారం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం’ అని ట్వీట్‌ చేసింది.

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

17 COMMENTS

Comments are closed.

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...