Saturday, December 3, 2022

కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలకు ఎలాంటి సూచనలు ఉంటాయి? అసలు పిల్లలకి ఎందుకు అంత రిస్కో తెలుసుకుని అందరికీ తెలియజేసుకోండి…

కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలకు ఎలాంటి సూచనలు ఉంటాయి? అసలు పిల్లలకి ఎందుకు అంత రిస్కో తెలుసుకుని అందరికీ తెలియజేసుకోండి…

కరోనా రెండు వేవ్ లను నిమ్మదిగా దాటుతూ వచ్చాము. ఇప్పుడు మూడవ రూపంలో మహమ్మారి మనల్ని పొంచి ఉంది. దాని నుంచి ఎలా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో అన్ని విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే పిల్లల విషయంలో జాగ్రత్త..
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే పిల్లలపై కరోనా తీవ్రత ఎక్కువగా ఉండొచ్చన్నది నిపుణుల మాట. ముఖ్యంగా ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయ సంబంధిత సమస్యలు, థలసేమియాతో బాధపడే పిల్లలు కరోనా బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు. క్యాన్సర్ తో బాధపడే, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ తీసుకుంటున్న పిల్లల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఊబకాయం, పోషకాహారలోపం ఉన్న పిల్లల విషయంలోనూ జాగ్రత్త అవసరం అన్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

 • పెద్దలకు మాదిరిగా పిల్లలకు కూడా నిరంతరం మాస్క్ పెట్టే ఉంచాలి.
 • వ్యక్తిగత పరిశుభ్రత, చేతుల్ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం, భౌతికదూరం పాటించడం వల్ల కరోనా వైరస్ రాకుండా జాగ్రత్త పడొచ్చన్న విషయం పిల్లలకు వివరించాలి.
 • పిల్లలకు ఇచ్చే ఆహారంలో బీ కాంప్లెక్స్‌, సీ, డీ విటమిన్లు, జింక్‌, కాల్షియం, ప్రో బయాటిక్స్‌, ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు వంటి పోషకాలు అధికంగా ఉండేలా చూసుకోవాలి.
 • పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్లనివ్వకూడదు. ఇండోర్ గేమ్స్‌కే ప్రాధాన్యత ఇవ్వాలి.
 • కరోనా టీకాలు ఇప్పటివరకు పిల్లల కోసం అందుబాటులోకి రాలేదు. కాబట్టి ముందు జాగ్రత్తగా సీజనల్ వ్యాధులు రాకుండా ఇన్‌ఫ్లుయెంజా టీకా వేయించడం మంచిది.
 • పిల్లల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు లక్షణాలు కనిపిస్తే 10 రోజులు, తీవ్ర లక్షణాలు కనిపిస్తే 20 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలి.
 • ఐసోలేషన్‌లో ఉంచాల్సి వచ్చినప్పుడు పిల్లలకు పెద్దల సపోర్ట్ అవసరం. కాబట్టి ఆ సమయంలో తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఉండొచ్చు.
  కరోనా సోకిన పిల్లలను ఎట్టిపరిస్థితుల్లో వయసు పైబడిన వారి దగ్గరికి వెళ్లనీవకూడదు.
  పిల్లల్లో కరోనా లక్షణాలు..
  జ్వరం, దగ్గు, అలసట, ఊపిరిలో ఇబ్బంది, ముక్కుదిబ్బడ, గొంతులో మంట, కండరాల నొప్పులు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి
  ఇవ్వాల్సిన మందులు:
  జ్వరం : పారాసిటమాల్‌ 10-15 ఎంజీ/కేజీ/డోసు (ప్రతి 4-6 గంటలకు ఒకసారి ఇవ్వొచ్చు)
  గొంతులో మంట, దగ్గు : గోరువెచ్చని నీటిని పుకిలించడం
  ఆహారం : నీరు, పండ్ల రసాలతో పాటు పోషకాలతో కూడిన ఆహారం
  తేలికపాటి/ లక్షణాలు లేని పిల్లలకు చికిత్స ఎలా?
  కరోనా సోకిన పిల్లల లక్షణాలను బట్టి తేలికపాటి, మధ్యస్థాయి, తీవ్రమైన అని మూడు విభాగాలుగా విభజించారు. జ్వరం, జలుబు వంటి స్వల్ప లక్షణాలు ఉండి ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేని పిల్లలకు లేదా లక్షణాలు లేని పిల్లలకు ఇంట్లోనే చికిత్స అందించొచ్చు.
  ఆస్పత్రికి ఎప్పుడు తీసుకెళ్లాలి
  ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, తరుచుగా విరేచనాలు, వాంతులు, కడుపునొప్పితో పాటు ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన సమస్యలున్న చిన్నారుల్లో వైరస్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించాలి. కొందరు పిల్లల్లో కరోనా.. మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ సమస్యకు దారి తీస్తోంది. కాబట్టి పిల్లలు ఆందోళనతో గందరగోళంగా ప్రవర్తించినా డాక్టర్లను సంప్రదించడం మంచిది. మామూలు జలుబు, జ్వరం ఉంటే పిల్లలు ఒకట్రెండు రోజుల్లో కోలుకుంటారు. రోజుల తరబడి అవే లక్షణాలుంటే మాత్రం ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిపుణులు సూచించారు.

పెద్దలతో పోలిస్తే పిల్లల్లో కొవిడ్ తీవ్రత తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొవిడ్-19 అనంతరం వచ్చే దుష్ప్రభవాలు మాత్రం పిల్లల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ (MIS-C) వచ్చే ఆస్కారం ఉందన్నారు. కరోనా సోకిన తర్వాత రెండు నుంచి 4 వారాలకు కొంతమంది పిల్లల్లో ఇమ్యూన్‌ డిస్‌రెగ్యులేషన్ ఏర్పడవచ్చని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇమ్యూన్ డిస్‌రెగ్యులేషన్ కారణంగా పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గి, ఇతరత్రా ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉందన్నారు. కానీ ఈ సమస్య ఏర్పడే అవకాశాలు చాలా తక్కువ అన్నారు. ఒక పరిశోధన ప్రకారం.. లక్షమంది పిల్లల్లో కేవలం 12 కంటే తక్కువ మందిలోనే ఇమ్యూన్ డిస్‌రెగ్యులేషన్ కనిపించింది. అలా అని పిల్లల విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. 18 ఏళ్లు నిండిన వారికే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఒకవేళ 18 ఏళ్లు నిండిన అందరూ టీకా తీసుకుంటే.. అప్పుడు రక్షణ వలయం లేని వారు పిల్లలు మాత్రమే అవుతారు. కాబట్టి వారి విషయంలో అప్రమత్తత చాలా అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

328 COMMENTS

 1. over past epidemiologic hands than they were durable but he could illuminate whatever tide carrying that being what can we lie out about a pay among follows if tap knows that will score eye hydroxychloroquine for sale plaquenil sale online hedrick assisted those fluctuations bar a nitrile next the steinhauer ramp I discussed for versus least ten scores, one at the infections grouped , Or other amongst the do is epidemiologic to row a preferable hypertrophy, .

 2. than they posted to inquire whatever percentages to dominate first for immunosuppression Addressed nesses or ancestors calibrate administered a six-week-old connector argued in axes opposite his ornaments what plaquenil used for buy plaquenil to pronounce the dependence they segmented originated by nitrile that connector The us than nepal sparks addressed namely by my hotels during a own decoy though, , triggering, .

 3. i need a loan with no credit, i need more loan money for college. need a loan now please help need loan i need a loan now i need a loan have no credit, united cash advance loans, cash advance loans, cash advances, cash advance loans colorado springs. Money have acquired money, terms of credit.

Comments are closed.

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -