Friday, September 29, 2023

కరోనా థర్డ్ వేవ్ గురించి ఎస్‌బీఐ రిపోర్టు…

కరోనా థర్డ్ వేవ్ గురించి ఎస్‌బీఐ రిపోర్టు…
కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడు కొంచెం తగ్గింది. పాజిటివ్ కేసులు తగ్గటటంతో పాటు, మరణాల సంఖ్య కూడా తగ్గింది. అయితే ఇప్పుడు థర్డ్ వేవ్ గురించి అందరిలో ఆందోళన మొదలయింది.ఈ క్రమంలో థర్డ్‌వేవ్‌ ప్రభావంపై ఎస్‌బీఐ తాజా సర్వేకీలక అంచనాలు వెలువరించింది. వచ్చే నెలలోనే (ఆగస్ట్‌) కరోనా థర్డ్‌వేవ్‌ మొదలయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అంతేకాదు సెప్టెంబర్ నెలలో కరోనా కేసుల నమోదు శిఖరాన్ని తాకుతుందని కూడా అంచనా వేసింది. ‘కోవిడ్‌-19: ద రేస్ టు ఫినిషింగ్ లైన్’ పేరుతో ఎస్‌బీఐ ఒక పరిశోధన నివేదికను విడుదల చేసింది. దేశంలో సెకండ్ వేవ్ పీక్ మే 7వ తేదీన నమోదైందని ఈ నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం డేటా ప్రకారం జులై రెండో వారంలో రోజుకు 10 వేల చొప్పున కేసులు నమోదు కావచ్చని, అలాగే ఆగస్ట్ 15 తరువాత కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరగొచ్చని ఎస్‌బీఐ రిపోర్ట్ అంచనా వేసింది.గ్లోబల్ డేటా అంచనాల ప్రకారం సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే కరోనా థర్డ్ వేవ్ సగటు ఉధృత కేసులు 1.7 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. చారిత్రక పోకడల ఆధారంగా ఆగస్ట్ 12 తరువాత కేసుల సంఖ్య క్రమంగా పుంజుకుని, నెల తరువాత పీక్ స్టేజీకి వెళ్లేఅవకాశం ఉంది. దేశంలో లక్షా, 50 వేలనుంచి 2 లక్షల వరకు కేసులు నమోదు కానున్నాయని ప్యానెల్‌ సభ్యులు, ఐఐటీ కాన్పూర్‌ శాస్త్రవేత్త అగర్వాల్‌ హెచ్చరించారు. ఐఐటీ హైదరాబాద్‌ శాస్త్రవేత్త ఎం విద్యాసాగర్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ (మెడికల్) లెఫ్టినెంట్ జనరల్ మాధురి కనిత్కర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

Related Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

2037 COMMENTS