Friday, January 27, 2023

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో, ఈ టూర్ కి అన్ని సిద్ధం…

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో, ఈ టూర్ కి అన్ని సిద్ధం…

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పలు పర్యాటక ప్రదేశాలకు పర్యాటకు తరలివెళుతున్నారు. ఈ క్రమంలో చార్‌ ధామ్‌ యాత్రతో సహా దేశంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక రైలును నడపాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. “చార్ ధామ్ యాత్ర” ను కొత్త సాధారణ పద్ధతిలో నిర్వహించాలనే ఉద్ధేశ్యంతో ఏసీ టూరిస్ట్‌ ట్రైన్‌ ద్వారా ‘చార్‌ధామ్‌ యాత్ర’ను ప్రారంభించింది. రామాయణ సర్క్యూట్‌లో నడుస్తున్న ‘శ్రీ రామాయణ యాత్ర’ రైలు ప్రజాదరణ పొందింది.దీంతో ఐఆర్‌సీటీసీ ‘దేఖో అప్నా దేశ్‌’ డీలక్స్‌ ఏసీ టూరిస్ట్‌ ట్రైన్‌ ‘చార్‌ధామ్‌ యాత్ర’ను ప్రారంభించాలని నిర్ణయించింది.
ఈ యాత్ర 16 రోజుల పాటు కొనసాగనుంది. ఢిల్లీలోని సఫ్ధర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి సెప్టెంబర్‌ 18న రైలు బయలుదేరనుంది. ఈ యాత్రలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. బద్రీనాథ్‌తో పాటు చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న’మన’ గ్రామం, నర్సింగ్‌ ఆలయం (జోషిమత్‌) ఆలయం, పూరి గోల్డెన్ బీచ్, కోణార్క్ లోని సూర్యదేవాలయం, చంద్రభాగ బీచ్, ధనుష్కోడితో సహా రామేశ్వరం, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, శివరాజ్‌పూర్ బీచ్, బెట్ ద్వారకతో సహా రిషికేశ్, జగన్నాథ్ పూరి ఆలయాలను ఈ యాత్రలో దర్శించుకోవచ్చు.

ఈ ట్రైన్‌ సుమారు 8,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. స్టేట్ ఆఫ్ ఆర్ట్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్‌లో రెండు రెస్టారెంట్లు, ఒక ఆధునిక వంటగది, రైలు కోచ్‌లో షవర్ క్యూబికల్స్, సెన్సార్ ఆధారిత వాష్‌రూమ్ ఫంక్షన్లు, ఫుట్ మసాజర్ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ట్రైన్‌ మొత్తం ఎయిర్‌కండిషన్‌ కాగా.. ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల భద్రత కోసం రైలులో ప్రతి కోచ్‌కు సీసీటీవీ కెమెరాలను సైతం బిగించారు.
దేశీయ పర్యాటకాన్ని రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ ‘దేఖో అప్నా దేశ్’కు అనుగుణంగా ప్రత్యేక రైలును ఐఆర్‌సీటీసీ ప్రారంభిస్తోంది. ప్యాకేజీ ధరను రూ.78,585కు నిర్ణయించారు. రైలు ప్రయాణం, డీలక్స్‌ హోటళ్లలో వసతి, భోజనం, వాహన సదుపాయం, ఆలయాల్లో దర్శనం, ప్రయాణ బీమా తదితర వసతులను ఐఆర్‌సీటీసీ కల్పించనుంది. ఈ డీలక్స్ టూరిస్ట్ రైలులో కరోనా మహమ్మారి వేళ 120 మందికే అవకాశం కల్పిస్తోంది. ఫేస్ మాస్క్‌లు, హ్యాండ్ గ్లోవ్స్, శానిటైజర్ పర్యాటకులందరికీ ఐఆర్‌సీటీసీ కిట్లను సమకూర్చనుంది. అయితే, 18 సంవత్సరాలు దాటిన వారందరు కనీసం ఒక మోతాదు టీకా తీసుకొని ఉండాలి.

Related Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,500SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..