ఒక్క రూపాయికే ఇంట్లోకి కిరాణా సరుకులు! త్వరపడకండి…
మోసం చేసేవాడికి, మోసపోయేవాడంటే ఎంత ఇష్టం అంటే, వాడి అవసరాలను, ఆశలను అన్నిటిని బాగా పరిశీలించి మరీ ముంచేస్తాడు. సైబర్ నేరగాళ్లు రోజురోజుకు చెలరేగిపోతున్నారు. వారి తెలివికి పెట్టె పదునుకు అంతం లేకుండా పోయింది. రోజుకొక కొత్త కొత్త ఆలోచనలతో ప్రజలను మోసం చేస్తున్న వీరి తెలివిని ఇంకేదైనా మంచి పనికి వాడితే మంచి అభివృద్ధిని సాధిస్తారు అనిపిస్తుంది.
ఇప్పటికే ఎన్నో రకాల సైబర్ నేరాలను పోలీసులు గుర్తించగా తాజాగా ఓ కొత్త రకం మోసాన్ని గుర్తించారు. సైబర్ నేరగాళ్లు ఈ కామర్స్ వెబ్ సైట్ పేరుతో మోసం చేయడాన్ని పోలీసులు గుర్తించారు. తక్కువ ధరలకు నిత్యావసరాలకు అందిస్తామంటూ జాప్ నౌ పేరుతో ఓ వెబ్ సైట్ ను రూపొందించారు.
వెబ్ సైట్ లో పలు వస్తువులు 1 రూపాయికే అందిస్తామని అమాయకులకు వల వేస్తున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ లేకుండా ఆన్ లైన్ చెల్లింపు మాత్రమే చేయాలని నిబంధనను పెట్టారు. ఇక డబ్బు చెల్లించాక డెలివరీ వస్తువులు డెలివరీ అవ్వడం లేదు. దీనిపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుస ఫిర్యాదులు నమోదయ్యాయి. తాంతో సైబర్ క్రైం పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు