ఒక్కసారిగా ఈ మహిళ బ్యాంకు అకౌంట్లో 74 వేల కోట్ల డబ్బు ఎలా వచ్చిందంటే…
బ్యాంకు లో మన అవసరానికి తగినంత డబ్బు ఉంటేనే చాలు, ఎంతో ఆనందపడిపోతాము. అలాంటిది బ్యాంకు బాలన్స్ చాలా తక్కువ ఉండగా, ఆ ఉన్న కొంచెం ఆఖరు డబ్బులు అవసరానికి వాడుకుందామని వెళ్లే సమయానికి అందులో కొన్ని వేల కోట్ల సొమ్ము మన అకౌంట్ లో ఉందని తెలిస్తే, ఏమైపోతామో… షాక్ నుంచి బయటకు వస్తే పరవాలేదు, గుండె వీక్ గా ఉంటె ఇంతే సంగతులు, ఇక పైకి పోవడమే. అయితే ఒక మహిళా అకౌంట్ లోకి ఇలానే అనుకోకుండా 74. వేల కోట్ల రూపాయల డబ్బు కనిపించింది. ఇక ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి.
ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళకు. 20 డాలర్లు డ్రా చేద్దామని ఏటీఎంకు వెళ్లింది. అయితే ఆమె అకౌంట్లో సరిపడా మొత్తం లేవని.. ఇప్పుడు 20 డాలర్లు డ్రా చేస్తే అది ఓవర్‌డ్రాఫ్ట్ కిందకు వస్తుందని మెసేజ్ వచ్చింది. పర్లేదు అనుకుని డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నించింది కానీ కుదరలేదు. అయితే తన బ్యాంకు బాలన్స్ చూద్దామని చూసింది. ఏకంగా తన ఖాతాలో బిలయన్ డాలర్లు(74,26,19,00,000 రూపాయలు) ఉన్నట్లు చూపింది.దానితో ఆమె షాక్ అయ్యింది. వెంటనే బ్యాంకు కు వెళ్లి జరిగినది చెప్పింది.ఆమె అకౌంట్లోకి ఇంత మొత్తం ఎలా వచ్చిందో వివరించారు. వాస్తవానికి సదరు మహిళ అకౌంట్లో నెగిటివ్ బిలియన్ డాలర్ల సొమ్ము ఉంది. మోసాలను నివారించడానికి ఈ పద్దతిని ఉపయోగిస్తారు. అనుమానాస్పదంగా తోచిన వ్యక్తి అకౌంట్‌ను లాక్ చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది అని తెలిపారు.