Friday, September 29, 2023

ఎన్టీఆర్ కి బిరియాని వండి పెట్టిన చిరంజీవి…

ఎన్టీఆర్ కి బిరియాని వండి పెట్టిన చిరంజీవి…
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఎన్నో వేడుకలు చేసుకోవాలని అనుకున్నారు గాని, కరోనా వాటన్నిటికీ అడ్డంగా నిలిచింది. కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం స్తంభించిపోయింది. అంతేకాదు ఎంతోమంది సెలబ్రెటీస్ కి కరోనా సోకడం, అందులో కొందరు చనిపోవడం కూడా జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన విషయం మనందరికీ తెలిసినదే. ఆయన జాగ్రత్తగా హోమ్ క్వారంటీన్ లో ఉన్నానని, బాగానే ఉన్ననాని ఫాన్స్ కి అప్డేట్ ఇస్తూ ఉన్నారు. అలాగే తన బర్త్ డే సందర్భంగా అభిమానులు ఎవ్వరూ కూడా ఎలాంటి వేడుకలు చేయవద్దని, దేశం ఇప్పుడు కరోనా అనే విపత్కర పరిస్ధితిని ఎదుర్కొంటుందని, ఈ సమయంలో సామాజిక దూరం పాటిస్తూ అందరూ ఇంట్లో ఆరోగ్యంగా ఉంటె అదే నాకు బర్త్ డే గిఫ్ట్ అని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాజమౌళి సినిమా ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పోస్టర్ చూసి నందమూరి అభిమానులు ఆనందంతో పొంగిపోయారు. అందులో తారక్ అధిరాదని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటె ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా పలువురు సెలబ్రెటీస్ సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి అయితే తారక్ కి ఇష్టమైన మటన్ బిరియాని స్వయంగా చేసి, పంపారని వార్తలు వచ్చాయి. ఈ వార్త ఎంతవరకు నియామో తెలీదు కానీ, నిజంగా చిరు చేతి బిరియాని ఎలా ఉంటుందో, ఆ అదృష్టం ఎన్టీఆర్ కి దక్కిందని మెగా అభిమానులు అనుకుంటున్నారు.

Related Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

1945 COMMENTS

  1. Hello, I think your blog may be having web browser compatibility issues.
    When I take a look at your web site in Safari, it looks fine but
    when opening in I.E., it’s got some overlapping issues.
    I just wanted to provide you with a quick heads up! Besides that, wonderful blog!