Friday, January 27, 2023

ఉద్యోగులకు తీపి కబురు. రూ.లక్ష బోనస్…

ఉద్యోగులకు తీపి కబురు. రూ.లక్ష బోనస్…
ఉద్యోగులకు తీపికబురు. అదిరిపోయే శుభవార్త అందింది. కరోనా వైరస్ కారణంగా ఎంప్లాయీస్‌కు రూ.లక్ష లభించనున్నాయి. అయితే అందరికీ ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉండదు. కేవలం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. టెక్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు పాండామిక్ బోనస్ కింద రూ.లక్ష అందించనుంది. కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో ఉద్యోగులకు బాసటగా నిలవాలనే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల లేదా ఆగస్ట్ నెలలో ఈ బోనస్ డబ్బులు ఉద్యోగుల అకౌంట్లలోకి చేరనున్నాయి. మైక్రోసాఫ్ట్‌కు ప్రపంచ వ్యాప్తంగా 1,75,508 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ బోనస్ డబ్బులు అందనున్నాయి. బోనస్ డబ్బుల వల్ల కంపెనీకి 200 మిలియన్ డాలర్ల మేర భారం పడనుంది. అయితే గిట్‌హబ్, లింక్డ్ఇన్, జెనిమ్యాక్స్‌లో పని చేసే ఉద్యోగులకు ఈ బోనస్ వర్తించదు. ఇకపోతే రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా తీపికబురు అందబోతోంది. పెండింగ్‌లో ఉన్న 3 ఇన్‌స్టాల్‌మెంట్ల డీఏ బకాయిలను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో చెల్లించే అవకాశం ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలుగనుంది.

Related Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

4100 COMMENTS