Friday, September 29, 2023

ఈ రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం. వాక్సిన్ గురించి కీలక సమాచారం.

ఈ రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం. వాక్సిన్ గురించి కీలక సమాచారం.

కరోనా వైరస్ నుంచి ఇప్పటి వరకు ప్రపంచానికి విముక్తి రాలేదు. ఎప్పటికి వస్తాదో కూడా తెలియడం లేదు. మొదటి వేవ్, రెండవ వేవ్ తోనే అలసిపోయిన ప్రపంచం ఇంకా థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి కావాల్సిన సన్నాహాలను, ధైర్యాన్ని కూడబెట్టుకుంటుంది. ఇలాంటి సమయంలో డెల్టా వేరియంట్ ఒకటి మొదలయ్యింది. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఇది భారతదేశాన్ని కూడా తాకింది. దీని బారినపడి తొలి మరణం కూడా మనదేశంలో నమోదు అయ్యింది.మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో డెల్టా ప్లస్ వేరియంట్‌ సోకి బుధవారం ఒక మహిళ మృతి చనిపోయింది.
మృతురాలి నుంచి తీసుకున్న నమూనాల జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ఆధారంగా సదరు మహిళ కరోనా వైరస్‌ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వల్లనే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. సదరు మహిళ ఈ ఏడాది మే 23న డెల్టా వేరియంట్‌ బారిన పడినట్లు తెలిపారు. బాధితురాలి కంటే ముందు ఆమె భర్తకు కోవిడ్‌ సోకిందని.. కానీ అతడు అప్పటికే వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నాడని తెలిపారు. ఫలితంగా అతడు కోలుకున్నాడన్నారు. కానీ బాధితురాలు మాత్రం వ్యాక్సిన్‌ ఒక్క డోసు కూడా తీసుకోలేదని.. అందువల్లే ఆమె మృతి చెందిందని డాక్టర్లు చెప్పారు. అంటే కరోనాని, డెల్టా వేరియంట్ ని ఎదుర్కోవాలి అంటే మనందరం ఖచ్చితంగా వాక్సిన్ వేయించుకోవాలి. కనుక వాక్సిన్ పై ఎలాంటి అపోహలు ఉంచుకోకుండా, మీ టర్న్ రాగానే ఖచ్చితంగా వాక్సిన్ తీసుకోండి. ఈ విలువైన సమాచారాన్ని అందరికి తెలియజేయండి…

Related Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

Stay Connected

22,046FansLike
0FollowersFollow
21,200SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..