Saturday, December 3, 2022

ఈ ఫోటో వెనుక ఓ అందమైన ప్రేమకథ…

ఈ ఫోటో వెనుక ఓ అందమైన ప్రేమకథ…
ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు. ‘చాందినీ చంద్రన్’. ఆమె ఇప్పుడు ఐఏఎస్ అధికారిణి. ఈ ఫోటో తీసేనాటికి ఆమెకు వివాహం కాలేదు. కానీ ఈ ఫోటోలో ఆమెతో పాటు ఉన్నది ఆమె భర్తే. కానీ అప్పుడు ఇష్టసఖుడు..ఇప్పుడు ఆమె జీవన సహచరుడు. ఐఏఎస్ అధికారి కావాలనే కలతో 2015లో చాందినీ చంద్రన్ సివిల్స్ పరీక్షలు రాశారు. ఎంతో ఇష్టపడి..కష్టపడి పరీక్షలు రాశాక. ఆమె రిలాక్స్ అవ్వాలనుకున్నారు. అలా తన ఇష్టసఖుడితో కలిసి బయటకు వెళ్లారు. అదే సమయంలో వర్షం పూల జల్లులా పడింది. అంతే ఇద్దరూ గొడుకు కింద చేరారు. అదే సమయంలో ఓ కెమెరా క్లిక్ మంది. అదే ఈనాడు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఐఏఎస్‌ అధికారిణి చాందినీ చంద్రణ్‌ ఆమె భర్త కలిసి ఉన్న ఫోటో.. ఈ ఫోటో వెనుక ఉన్న ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

తన ప్రియ మిత్రుడు..జీవితం పంచుకోవాలనుకునే ఇష్టసఖుడు అయిన అరుణ్‌ సుదర్శన్‌తో కలిసి చాందినీ చంద్రణ్ సరాదాగా ఔటింగ్‌కి వెళ్లారు. సరిగ్గా అప్పుడే వర్షం పడింది. ఒకే గొడుగు కింద ఇద్దరూ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు. అరుణ్‌ సుదర్శన్‌ ఆమె భుజంపై ఆత్మీయంగా చేయి వేసి ముందుకు నడిపిస్తుండగా.. ఆమె చిరునవ్వులు చిందిస్తున్నారు. అప్పుడే ఓ ఫొటో జర్నలిస్టు కెమెరాను క్లిక్‌ మనిపించారు. ఇంకేముంది.. తర్వాతి రోజు పత్రికలో.. ”వేసవివి సెలవు.. రాష్ట్రంలో అక్కడక్కడా జల్లులు పడే అవకాశం ఉంది” అంటూ చాందినీ చంద్రణ్‌, అరుణ్‌ సుదర్శన్‌ నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోను ఇందుకు జతచేసి పబ్లిష్‌ చేసి ఓ ఇంగ్లీషు పత్రికలో వేశారు.

దీంతో.. అరుణ్‌ సుదర్శన్‌… సదరు పత్రికా సంస్థకు ఫోన్‌ చేసి, తమ ఫొటో ఎందుకు వేశారని నిలదీశారు. సదరు ఫొటోగ్రాఫర్‌తో మాట్లాడి ఇలాంటి ఫొటోలు అనుమతి లేకుండా పబ్లిష్‌ చేయటమేంటీ అని నిలదీశారు. ఇటువంటివి ప్రచురించేటప్పుడు వారిజీవితాలు ఏమవుతాయనే విషయం ఆలోచించరా? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్న ఐఏఎస్‌ చాందినీ చంద్రణ్‌ గత జ్ఞాపకాలకు గుర్తు చేసుకున్నారు.
ఈ ఫోటోలో తప్పేమీ లేదు. కానీ కొన్నిసార్లు. కొన్ని సందర్భాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఎందుకంటే.. అప్పటికి మాకింకా పెళ్లి కాలేదు. కానీ ఈ తరువాత మేం వివాహం చేసుకున్నాం. ఇటీవలే ఈ ఫొటో గురించి గుర్తుకు రాగా.. అరుణ్‌ సుదర్శన్‌ సదరు ఫొటోగ్రాఫర్‌ను సంప్రదించగా… ఆ ఫొటోకాపీని మాకు పంపించారు. ఇందుకు కేవలం థాంక్స్‌ అనే మాటతో సరిపెట్టలేను’ అంటూ అలనాటి తమ ప్రేమకథను..అనుకోకుండా జరిగిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారామె. ఆ ఫోటో వెనుక ఉన్న తమ ప్రేమకథను తెలిపారు.

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

1969 COMMENTS