Saturday, December 3, 2022

ఇలానే ఉంటె, ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా? ఇందులో మీరున్నారా?

ఇలానే ఉంటె, ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా? ఇందులో మీరున్నారా?

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని ఒక రకంగా భయపెట్టింది. కొన్ని రాష్ట్రాలలో తీవ్రమైన కరోనా ప్రభావం వలన ఎన్నో ప్రాణాలను కూడా కోల్పోయాము. తెలంగాణాలో లాక్ డౌన్ అమలు చేసిన తరవాత నిమ్మదిగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. అయితే వ్యాపారస్తులు మాత్రం అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. సరిగ్గా వ్యాపారం లేక్, షాప్ రెంట్ కూడా కట్టలేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిమ్మదిగా కరోనా కేసులు తగ్గుతూ రావడం వలన ప్రభుత్వం లాక్ డౌన్ టైమింగ్ ని సవరిస్తూ వచ్చింది.

లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో వ్యాపారులకు ఊరట లభించినట్లయ్యింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షలు, లాక్‌డౌన్‌తో వ్యాపారులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. మొదట ఉదయం 10 గంటల వరకు అవకాశం ఇచ్చినప్పటికీ వ్యాపారుల నిర్వహణ సాధ్యం కాలేదు. హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లతోపాటు వాణిజ్య దుకాణదారులు తమ వ్యాపారాలు నడుపుకోలేక, షాపుల అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడ్డారు. తర్వాత ప్రభుత్వం ఒంటి గంట వరకు అవకాశం ఇచ్చినప్పటికీ వ్యాపారులు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగించలేకపోయారు. బుధవారం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వెసులుబాటు కల్పించడంతో వ్యాపారులకు ఊరట లభించింది.

అంతా బాగానే ఉంది గాని, సాయంత్రం 5 వరకు అవకాశం ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం ఒకే ప్రాంతంలో ఎక్కువమంది గుమ్ముగూడి మరి షాపింగ్ చేస్తున్నారు. కరోనా నిభందనలు పెద్దగా పాటించడం లేదు. ఇలానే చేస్తే, మళ్ళి కరోనా సమస్యను భయంకరంగా ఎదుర్కోవలసి వస్తుంది అని వైద్యులు చెబుతున్నారు. అవకాశం ఉన్నప్పటికీ భౌతిక దూరం పాటించడం చాలా అవసరం. పై ఇమేజ్ లో చూడండి . అందరూ ఎలా దగ్గర దగ్గర నిలబడి షాపింగ్ చేస్తున్నారో, ఇలా చేస్తే ప్రమాదాన్ని కొని తెచుకున్నట్టే. ఇలాంటి గుంపులో మీరు కూడా ఉంటున్నారా? వెంటనే ఈ అలవాటు మానుకోండి…

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...