ఇది ఎందుకు ప్రమాదకర సమయమో హెచ్చరిస్తున్న డబ్ల్యూహెచ్ఓ…
కరోనా కొద్దిగా తగ్గుతుండటంతో అందరూ దీని నుంచి బయటపడ్డాము అన్నట్టు అనుకుంటే పొరపాటు. ఇంకా కరోనా పూర్తిగా వదిలి వెళ్ళలేదు. ముందు ముందు ఇంకా చాలా కష్టమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది.డెల్టా వేరియంట్ కారణంగా ప్రపంచం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అథానమ్ తాజాగా వ్యాఖ్యానించారు. తొలుత భారత్‌లో వెలుగు చూసిన ఈ వేరియంట్ ఇప్పటికే 98 దేశాలకు పాకిందని, అత్యధిక కేసులకు కారణమయ్యే డామినెంట్ వేరియంట్‌గా మారుతోందని ఆయన తెలిపారు.
మరోపక్క వాక్సిన్ ప్రక్రియని వేగవంతం చేయకపోయినా, ఎక్కువశాతం ప్రజలు వాక్సిన్ వేసుకోకపోయినా చాలా ప్రమాదం ఎదుర్కోవలసి వస్తాదంట. మళ్ళి హాస్పిటల్ లో బెడ్ లు సరిపోక ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.డెల్టా వేరియంట్ ప్రమాదకారి అని అభివర్ణించిన డబ్ల్యూహెచ్ఓ చీఫ్..ఈ వేరియంట్‌లో కొత్త మూట్యేషన్ల కారణంగా ఇప్పటికీ పరిణామం చెందుతోందని తెలిపారు.కరోనా సంక్షోభానికి సంబంధించి అత్యంత ప్రమాదకరమైన స్థితిలో మనమున్నాం” అని టెడ్రోస్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న దేశాల్లో కరోనా రోగుల తాకిడికి బెడ్లు సరిపోక ఆస్పత్రులు తిప్పి పంపిస్తున్న దృశ్యాలు మళ్లీ సాధారణమైపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.