Saturday, December 3, 2022

ఇంట కాస్త తగ్గినా, రచ్చ గెలిచిన ప్రధాని మోడీ…

ఇంట కాస్త తగ్గినా, రచ్చ గెలిచిన ప్రధాని మోడీ…
దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా క్రమంగా తగ్గుతోందని అమెరికాకు చెందిన డేటా ఇంటలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ చెబుతోంది. 2019 నాటితో పోలిస్తే మోడీకి ఉన్న జనామోదం 20 పాయింట్ల మేర తగ్గినట్లు వెల్లడించింది. ఆగస్టు 2019లో మోడీకి 82 శాతం ఉండగా ఇప్పుడు 66 శాతానికి పడిపోయినట్లు అంచనా. జమ్ముకాశ్మీర్ విభజన, ఆర్టికల్370 రద్దు సమయంలో మోడీ నాయకత్వానికి ఎక్కువ జనామోదం లభించగా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆయన ఇమేజ్ గ్రాఫ్ పడిపోవడం తెలిసిందే. ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దలు అంటారు. మన ప్రధాని ఇంట కాస్త తగ్గినా కూడా రచ్చ మాత్రం నెంబర్ వన్ అనిపించుకుని భారతదేశం గర్వించేలా చేశారు.

ప్రపంచ నాయకులపై సర్వే నిర్వహించే ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ సంస్థ తన సర్వే నివేదికను శుక్రవారం విడుదల చేసింది. ఈ నివేదికలో అత్యంత మంది నమ్ముతున్న నేతగా నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలించారు. నరేంద్ర మోదీని 66 శాతం మంది ప్రజలు విశ్వసిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఆ తర్వాత 65 శాతం మంది ప్రజలు ఇటలీ ప్రధాని డ్రాగీ నాయకత్వాన్ని సమర్ధించారు. 63 శాతంతో మెక్సికో అధ్యక్షుడు లోపేజ్ ఓబ్రడార్ మూడో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ నాయకత్వాన్ని 54 శాతం మంది ప్రజలు సమర్ధించారు దీంతో ఆయన నాలుగవ స్థానంలో నిలిచారు.

వై. పార్వతి

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...