కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్ ఆర్ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.. ఆ మాటకొస్తే దేశ సినీ పరిశ్రమలోనే అత్యంత అరుదైన యాక్టర్ ఎన్టీఆర్. తన అసమాన అభినయ సామర్థ్యంతో ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల నేర్పు అతనిది.. అంతటి నటుడికి నాలుగేళ్ల శ్రమ తర్వాత ట్రిపుల్ ఆర్ సినిమా ద్వారా లభించిందేమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..!
నిజానికి.. తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌తో ట్రిపుల్ ఆర్ సినిమాకు మెయిన్ ఫిల్లర్‌గా నిలబడ్డాడు ఎన్టీఆర్. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంలో ఆయనది కీలక పాత్ర. అంతటి అంతులేని నటశిఖరాన్ని.. దర్శకుడు రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమా ద్వారా చిన్నబుచ్చాడా? అంటే ఫ్యాన్స్ అవుననే అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా సెకండాఫ్‌లో.. క్లైమాక్స్‌లో కేవలం ఒక మాములు పాత్రగా ఎన్టీఆర్ మిగిలిపోవడం.. నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఫస్టాప్‌లో కొమురం భీమ్ నేపథ్యంగా కథ నడిపిన రాజమౌళి.. సెకండాఫ్ వచ్చేసరికి ఆ ట్రాక్‌ను పూర్తిగా.. పక్కన బెట్టాడు.. సినిమాలో కొమురం భీమ్ ప్రభావాన్ని తగ్గించాడు.. అల్లూరి సీతారామరాజు మీద ఫోకస్ పెట్టాడు. కథ దారితప్పింది ఈ సెకండాఫ్‌లోనే.. దర్శకుడు ఇలా ఏవేవో ప్రయోగాలు చేయడంతో.. కొమరం భీమ్ పాత్ర కుంచించుకుపోయింది. మరోవైపు అల్లూరి పాత్ర.. అందులో రాంచరణ్‌ను అమాంతం ఆకాశానికి ఎత్తేసిన డైరెక్టర్.. క్లైమాక్స్‌కు వచ్చేసరికి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు చెప్పలేని గుండెకోత మిగిల్చాడు.
సినిమాలో ఎన్టీఆర్-రాంచరణ్ పాత్రలకు సమప్రాధాన్యమిస్తానని చెప్పుకొచ్చిన రాజమౌళి.. తీరా సినిమాలో చేసేదేమిటని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అసలు ఇది రాజమౌళి తీసింది మల్టీ స్టారర్ మూవీనా? లేక రామ్‌చరణ్ మూవీనా ? అని నిలదీస్తున్నారు. అయితే, మూడార్ల సక్సెస్‌లో మునిగిన మేకర్స్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే మూడ్‌లో లేరు..కలెక్షన్ల రీసౌండ్‌తో ఖుషీ అవుతున్న టీమ్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదనను ఎక్కడా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. ఇక, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఎన్టీఆర్.. ట్రిపుల్ ఆర్ సినిమాలో తన పాత్ర మేరకు వందశాతం న్యాయం చేశాడు. అంతేకాకుండా ఈ సినిమా పూర్తిగా తనదే అన్నట్టుగా ప్రమోషన్స్‌లో దుమ్మురేపాడు. ఇంటర్యూలలో తన టైమింగ్, పంచులతో రఫ్పాడించాడు.
నిజానికి చెప్పాలంటే.. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కోల్పోయాడని చెప్పాలి. వరుస హిట్స్‌తో జోరు మీద ఉన్న సమయంలోనే.. దాదాపు నాలుగేళ్ల విలువైన సమయాన్ని ఈ సినిమా కోసం కేటాయించాడు. మరో సినిమా ఒప్పుకోకుండా వందశాతం ఇదే సినిమాకు కమిట్ అయి పనిచేశాడు. టాప్ మోస్ట్ సూపర్ స్టార్ అయినప్పటికీ.. సినిమా కథ- కథనాల్లో ఎక్కడా జోక్యం చేసుకోలేదు. హుందాగా వ్యవహరిస్తూ.. నిబ్బరమైన తన ప్రవర్తనతో మరో ఉన్నతమైన మెట్టు ఎక్కాడు ఎన్టీఆర్..
నిజానికి ట్రిపుల్ ఆర్ ద్వారా జూనియర్ నటుడిగా మరో మెట్టు ఎక్కడని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకోవచ్చు.. కేవలం సినిమా కోసం 100 శాతం ఎఫర్ట్ పెట్టే ఇలాంటి సూపర్ స్టార్ ఉండటం.. చాలా గొప్ప విషయం అని చెప్పాలి.. ఎంతో గొప్ప మనసు.. కమిట్మెంట్ ఉంటే తప్ప ఒక అగ్ర నటుడు ఇలా వ్యవహరించడం అత్యంత అరుదు. కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్ చేసిన ఫర్ఫార్మెన్స్ చాలు.. ఆయన గొప్పతనానికి చెప్పడానికి.. ఇక రాజమౌళి అనాలోచితంగానో.. అనుకోకుండా చేశాడో గానీ.. ఇక, ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయాలి. ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం ఎన్టీఆర్ తరహాలో హుందాగా వ్యవహరిస్తూ.. మంచి నటనను కనబర్చిన రాంచరణ్‌ను పొగడటం.. టాలీవుడ్‌లో వచ్చిన మంచి మార్పు.. దీనికి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు హ్యాట్సాప్ చెప్పాలి.. ఎన్టీఆర్ ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.. జై ఎన్టీఆర్..
వై. పార్వతి