Friday, September 29, 2023

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని భావించారు. ఇప్పటివరకూ బాలీవుడ్‌ సినిమాకే ఆస్కార్‌ దక్కలేదు. ఇక తెలుగు సినిమా సంగతి సరేసరి. అవార్డు సంగతి పక్కన పెట్టినా, కనీసం మన దేశం నుంచి పంపే అఫిషియల్‌ సబ్మిషన్‌ లిస్టులోనూ టాలీవుడ్‌కు చోటు దొరకటం లేదు. పాన్‌ ఇండియా లెవల్‌లోనే కాదు, వెస్ట్‌ దృష్టిని కూడా ఆకర్షించిన ఆర్‌ఆర్‌ఆర్‌కి అవకాశం దక్కకపోవటం, తెలుగువారిని బాగా నిరాశపరిచింది.

ఆర్‌ఆర్‌ఆర్‌, కశ్మీర్‌ఫైల్స్‌తో పాటు మరికొన్ని సినిమాల పేర్లు కూడా వినిపించినప్పటికీ , ఎవరూ ఊహించని విధంగా గుజరాతీ సినిమా ” చల్లో షో’ ను ఎంపిక చేశారు. దీన్ని లాస్ట్‌ ఫిల్మ్‌ షో పేరుతో ఇంగ్లీష్‌లో రిలీజ్‌ చేశారు. గతేడాది జూన్‌లో ట్రిబెకా ఫిల్మ్‌ ఫెస్టివల్‌తో పాటు, అనేక ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు. అక్టోబర్‌ 14న విడుదల అయింది

నిజానికి ఆస్కార్‌ అవార్డులను ప్రధానంగా హాలీవుడ్‌ సినిమాలకోసమే నెలకొల్పారు. మొత్తం 23 విభాగాల్లో ఈ పురస్కారాలను అందచేస్తారు. పోటీలోకి దిగాలంటే 125 రకాల రూల్స్‌ పాటించాలి. హాలీవుడ్‌కి బయట ఉన్న ఇతర దేశాల, భాషలకు చెందిన సినిమాలకి కూడా గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో బెస్ట్‌ ఫారిన్‌ ఫిల్మ్‌ కేటగిరీని ఏర్పాటు చేసి అవార్డులు ఇవ్వటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ విభాగం పేరుని బెస్ట్‌ ఇంటర్నేషన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా మార్చారు.

ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరీలో వందదేశాలకు పైగానే పోటీపడతాయి. ఈ విభాగంలోనే ఇప్పుడు మన దేశం నుంచి చల్లో షో్ను పంపారు. పోయినేడాది నయనతార, విఘ్నేష్‌ శివన్‌ నిర్మించిన పెబెల్స్‌ అనే తమిళ సినిమాను అఫిషియల్‌గా సబ్మిట్‌ చేశారు. ఆస్కార్‌కి 1957 నుంచి అఫిషియల్‌గా సబ్మిట్‌ చేస్తోంది మన దేశం. ఇన్నేళ్లలో ఫైనల్‌ నామినేషన్స్‌ వరకూ వెళ్లినవి మూడంటే మూడే సినిమాలు. 1958లో మదర్‌ ఇండియా, 1989లో సలాం బాంబే, 2001లో లగాన్‌. కానీ ఏ ఒక్కటీ అవార్డుకి నోచుకోలేదు. సినిమాలకు రాకపోయినా, వ్యక్తిగతంగా మనోళ్లు సత్తా చాటారు.

దేశానికి తొలి ఆస్కార్‌ను సాధించిన ఘనత కాస్ట్యూమ్‌ డిజైనర్‌కి భాను అథయాకి దక్కింది. గాంధీ సినిమాకి గాను బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అవార్డు వరించింది. ఆ తర్వాత 1992లో సత్యజిత్‌రేకి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌ కేటగిరిలో ఆస్కార్‌ వచ్చింది. 2009లో ఎఆర్‌ రెహ్మాన్‌ , స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ సినిమాకి రెండు ఆస్కార్‌లు గెలిచాడు. ఇదే సినిమాకి రసూల్‌, గుల్జార్‌లు కూడా అవార్డులు దక్కించుకున్నారు. ఇప్పటివరకూ ఏడు కమల్‌హాసన్‌ సినిమాలు, ఐదు అమీర్‌ఖాన్‌ సినిమాలు, మూడు సత్యజిత్‌రే సినిమాలు అక్కడి వరకూ వెళ్లాయి, కానీ అవార్డు మాత్రం ఒక్కదానికీ రాలేదు. లగాన్‌ ఫైనల్‌ లిస్టులో నిలిచినా పురస్కారం మాత్రం దక్కలేదు, ఇది జరిగి 21 ఏళ్లవుతోంది. ఆ తర్వాత ఒక్క సినిమా కూడా ఫైనల్‌కి వెళ్లలేదు.

గొప్ప చిత్రాలకు ఆస్కార్‌ పురస్కారాలు కొలమానాలే కావొచ్చు. కానీ ప్రధానంగా అవి హాలీవుడ్‌కే పరిమితం అని గుర్తుంచుకోవాలి. ఇక ఆ అవార్డుల కమిటీల్లో ఉండేవాళ్లూ మనుషులే. వాళ్ల నేపథ్యాలు, ఆబ్లిగేషన్లు కూడా పనిచేయొచ్చు. అదలా ఉంచితే, అందులోనూ రాజకీయాలుంటాయని, బోలెడు ఖర్చు పెట్టాల్సి ఉంటుందనీ చెబుతారు. తెల్లగా ఉండే ఆస్కార్‌ ప్రతిమ, శ్వేతజాతీయుల పక్షపాతం చూపుతుందన్న విమర్శలూ ఉన్నాయి.

‘ఆస్కార్‌ అనేది అమెరికన్‌ స్టాండర్డ్‌ సినిమాలకు ఇచ్చే అవార్డు మాత్రమే. భారతీయ భాషల్లో నటిస్తే ఆస్కార్‌ రాదు. కాబట్టి దాని కోసం మనం వెంపర్లాడాల్సిన పనిలేదు. మనం ఇచ్చే అవార్డులను వాళ్లు తీసుకునే స్థాయికి మనం ఎదగాలి’ అంటూ ఉంటారు కమల్‌హాసన్‌. ఆస్కార్‌ గురించి చింతించకుండా, భారతీయ సినిమా – క్వాలిటీని పెంచుకోవటం మీద దృష్టి పెట్టడమే బెటర్‌.

నిజానికి ఆస్కార్‌ అవార్డులను ప్రధానంగా హాలీవుడ్‌ సినిమాలకోసమే నెలకొల్పారు. మొత్తం 23 విభాగాల్లో ఈ పురస్కారాలను అందచేస్తారు. పోటీలోకి దిగాలంటే 125 రకాల రూల్స్‌ పాటించాలి. హాలీవుడ్‌కి బయట ఉన్న ఇతర దేశాల, భాషలకు చెందిన సినిమాలకి కూడా గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో బెస్ట్‌ ఫారిన్‌ ఫిల్మ్‌ కేటగిరీని ఏర్పాటు చేసి అవార్డులు ఇవ్వటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ విభాగం పేరుని బెస్ట్‌ ఇంటర్నేషన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా మార్చారు.

ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరీలో వందదేశాలకు పైగానే పోటీపడతాయి. ఈ విభాగంలోనే ఇప్పుడు మన దేశం నుంచి చల్లో షో్ను పంపారు. పోయినేడాది నయనతార, విఘ్నేష్‌ శివన్‌ నిర్మించిన పెబెల్స్‌ అనే తమిళ సినిమాను అఫిషియల్‌గా సబ్మిట్‌ చేశారు. ఆస్కార్‌కి 1957 నుంచి అఫిషియల్‌గా సబ్మిట్‌ చేస్తోంది మన దేశం. ఇన్నేళ్లలో ఫైనల్‌ నామినేషన్స్‌ వరకూ వెళ్లినవి మూడంటే మూడే సినిమాలు. 1958లో మదర్‌ ఇండియా, 1989లో సలాం బాంబే, 2001లో లగాన్‌. కానీ ఏ ఒక్కటీ అవార్డుకి నోచుకోలేదు. సినిమాలకు రాకపోయినా, వ్యక్తిగతంగా మనోళ్లు సత్తా చాటారు.

దేశానికి తొలి ఆస్కార్‌ను సాధించిన ఘనత కాస్ట్యూమ్‌ డిజైనర్‌కి భాను అథయాకి దక్కింది. గాంధీ సినిమాకి గాను బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అవార్డు వరించింది. ఆ తర్వాత 1992లో సత్యజిత్‌రేకి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌ కేటగిరిలో ఆస్కార్‌ వచ్చింది. 2009లో ఎఆర్‌ రెహ్మాన్‌ , స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ సినిమాకి రెండు ఆస్కార్‌లు గెలిచాడు. ఇదే సినిమాకి రసూల్‌, గుల్జార్‌లు కూడా అవార్డులు దక్కించుకున్నారు. ఇప్పటివరకూ ఏడు కమల్‌హాసన్‌ సినిమాలు, ఐదు అమీర్‌ఖాన్‌ సినిమాలు, మూడు సత్యజిత్‌రే సినిమాలు అక్కడి వరకూ వెళ్లాయి, కానీ అవార్డు మాత్రం ఒక్కదానికీ రాలేదు. లగాన్‌ ఫైనల్‌ లిస్టులో నిలిచినా పురస్కారం మాత్రం దక్కలేదు, ఇది జరిగి 21 ఏళ్లవుతోంది. ఆ తర్వాత ఒక్క సినిమా కూడా ఫైనల్‌కి వెళ్లలేదు.

గొప్ప చిత్రాలకు ఆస్కార్‌ పురస్కారాలు కొలమానాలే కావొచ్చు. కానీ ప్రధానంగా అవి హాలీవుడ్‌కే పరిమితం అని గుర్తుంచుకోవాలి. ఇక ఆ అవార్డుల కమిటీల్లో ఉండేవాళ్లూ మనుషులే. వాళ్ల నేపథ్యాలు, ఆబ్లిగేషన్లు కూడా పనిచేయొచ్చు. అదలా ఉంచితే, అందులోనూ రాజకీయాలుంటాయని, బోలెడు ఖర్చు పెట్టాల్సి ఉంటుందనీ చెబుతారు. తెల్లగా ఉండే ఆస్కార్‌ ప్రతిమ, శ్వేతజాతీయుల పక్షపాతం చూపుతుందన్న విమర్శలూ ఉన్నాయి.

‘ఆస్కార్‌ అనేది అమెరికన్‌ స్టాండర్డ్‌ సినిమాలకు ఇచ్చే అవార్డు మాత్రమే. భారతీయ భాషల్లో నటిస్తే ఆస్కార్‌ రాదు. కాబట్టి దాని కోసం మనం
వెంపర్లాడాల్సిన పనిలేదు. మనం ఇచ్చే అవార్డులను వాళ్లు తీసుకునే స్థాయికి మనం ఎదగాలి’ అంటూ ఉంటారు కమల్‌హాసన్‌. ఆస్కార్‌ గురించి చింతించకుండా, భారతీయ సినిమా – క్వాలిటీని పెంచుకోవటం మీద దృష్టి పెట్టడమే బెటర్‌.

Related Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

Stay Connected

22,046FansLike
0FollowersFollow
21,200SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..