Friday, September 29, 2023

అలలపై శామలి సవారీ

  • సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి..
  • వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..
  • మత్య్సకార కుటుంబాలకు చెందిన స్త్రీలు..
  • కళ్లముందు సముద్రం.. నిత్యం పోటీపడే అలలు..
  • ఆ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లే పురుషులు.. రోజూ సముద్ర అలలతో సవారీ చేస్తూ సర్ఫింగ్‌ చేసే పర్యాటకులు. అయినా.. అక్కడి సంప్రదాయాల ప్రకారం స్థానిక మహిళలకు సముద్రంలోకి వెళ్లి.. సర్ఫింగ్‌ చేసే అవకాశం లేదు.. ఈ క్రమంలో ఒక మహిళ వేసిన ముందడుగుతో చేసిన సాహసం.. ఇప్పుడు అక్కడి పరిస్థితుల్ని మార్చివేసింది.. గ్రామీణ మహిళలూ అలలతో పోటీపడి.. ప్రస్తుతం సర్ఫింగ్‌ చేసేలా చేసింది. సంప్రదాయ బంధనాలను తెంచుకొని.. పురుషులకు దీటుగా గ్రామీణ మహిళలూ.. సర్ఫింగ్‌లో దూసుకుపోతున్నారు. పూర్తిగా మహిళలతో కూడిన సర్ఫింగ్‌ క్లబ్‌ను విజయవంతంగా నిర్వహిస్తూ.. స్త్రీ శక్తికి, స్త్రీల ఆత్మవిశాసానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. శ్రీలంక తూర్పు తీరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరుగమ్‌ బేలో ఇప్పుడీ కొత్త విప్లవం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా నిలుస్తోంది.. మహిళా శక్తిగా నిదర్శనంగా ప్రశంసలు అందుకుంటోంది.

ఈ విప్లవం వెనుక శామలి సంజయ అనే మహిళ అద్భుతమైన కృషి ఉంది. ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లి అయిన శామలి 2018లో శ్రీలంకకు చెందిన మొట్టమొదటి ఆల్‌ గర్ల్స్‌ సర్ఫ్‌ కల్బ్‌ను ప్రారంభించారు. ఆమెకు ఇందుకు కావాల్సిన ప్రోత్సాహం, స్ఫూర్తిని ఇచ్చింది మాత్రం.. టిఫాని కారోథర్స్‌ అనే మహిళ.. కాలిఫొర్నియా నుంచి వచ్చి అరుగం బేకు వచ్చి స్థిరపడిన ఆమె.. సర్ఫింగ్‌ క్రీడను నేర్చుకునేలా శామలిని ప్రోత్సహించారు. అందుకు కావాల్సిన పూర్తి సహాయసహకారాలతోపాటు శిక్షణ కూడా ఇచ్చారు.

స్థానిక సంప్రదాయాలకు విరుద్ధంగా వెళుతున్నందుకు సొంత కుటుంబం నుంచి, సమాజం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా ఆమె ధైర్యంగా నిలబడి.. అలలపై సవారీ చేయాలన్న తన కలను నెరవేర్చుకున్నారు. అలలను చూస్తే మొదట భయం వేసేదని.. కానీ ఒక్కసారి సర్ఫింగ్‌కి అలవాటు పడిన తర్వాత ఆ ఆటలోని గొప్పదనం తనకు తెలిసిందని శామలి చెప్తారు. అంతేకాకుండా స్థానిక మత్య్సకార గ్రామాల్లో పర్యటిస్తూ.. అక్కడి మహిళలు సర్ఫింగ్‌ నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నారు. మొదట ఆమె నిర్వహిస్తున్న మహిళా సర్ఫింగ్‌ క్లబ్‌లో చేరేందుకు చాలామంది అమ్మాయిలు, మహిళలు నిరాకరించేవారు. సర్ఫింగ్‌ ప్రమాదకరమైన క్రీడ అని, భద్రత ఉండదని భయపడేవారు.

అంతేకాకుండా సర్ఫింగ్‌ క్రీడ అంటే పార్టీలు, డ్రగ్స్‌, మద్యం వంటివి ఉండేవని భావించేవారు. ఛామనఛాయతో ఉండే స్థానిక మహిళలు ఇది పాశ్చాత్య సంస్కృతి అని, శరీర అందంతో ముడిపడిన ఆట అని అనుకునేవారు. కానీ అపోహాలను దూరం చేస్తూ.. మహిళలు ఎవరైనా ఈ క్రీడలో పాల్గొనవచ్చునని, కొద్దిపాటి శిక్షణతో అలలపై సవారీ చేయడం ద్వారా మహిళలు కూడా తమలోని ఆత్మవిశాసాన్ని పెంపొందించుకోవచ్చునని అవగాహన కల్పిస్తూ.. శామలి ముందుకు సాగారు. ఆమె ప్రయత్నం, ప్రచారం ఫలించి.. ఇప్పుడు డజన్‌ మందికి పైగా కోర్‌ టీమ్‌తో.. 45 మందికిపైగా సభ్యులతో అరుగం బే గర్ల్స్‌ సర్ఫ్‌ క్లబ్‌ విజయవంతంగా ముందుకుసాగుతోంది.

వై. పార్వతి

Related Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

Stay Connected

22,046FansLike
0FollowersFollow
21,200SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..