Friday, January 27, 2023

అమ్మాయే కదా అని లిఫ్ట్ ఇస్తే, అనుకోని ప్రమాదానికి గురైనట్టే…

అమ్మాయే కదా అని లిఫ్ట్ ఇస్తే, అనుకోని ప్రమాదానికి గురైనట్టే…

రోడ్డు మీద వాహనాలు వెళ్తున్నప్పుడు కొందరు లిఫ్ట్ ఇమ్మని అడుగుతుంటారు. పాపం మగవాళ్ళు ఎంత లిఫ్ట్ అడిగినా, చాలావరకు అతి తక్కువమంది మాత్రమే లిఫ్ట్ ఇవ్వడానికి అంగీకరిస్తారు. అదే ఒక ఆడపిల్ల అడిగితే మాత్రం అందరూ లిఫ్ట్ ఇవ్వడానికి ముందుకు వచ్చేస్తారు. ఆడవారికి సాయం చెయ్యడంలో మగవారికి చాలా ఆననందం కలుగుతాది. అయితే ఈరోజుల్లో మాత్రం అమ్మాయే కదా అని లిఫ్ట్ ఇస్తే, లేనిపోని సమస్యలు వస్తున్నాయి

.
రోడ్డుపై ఒంటరిగా నిలబడుతుంది. అటుగా వచ్చే వాహనదారులను ఆపుతుంది. అర్జంట్ గా వెళ్లాలని లిఫ్ట్ అడుగుతుంది. అయ్యో పాపం.. అసలే అమ్మాయి. పైగా అత్యవసరం అంటోంది అని జాలి చూపారో ఇక అంతే. అడ్డంగా బుక్కవడం ఖాయం. బైక్ పై సగం దూరం వెళ్లాక ఆమె తన అసలు రూపం చూపిస్తుంది. డబ్బులు ఇస్తావా.. అఘాయిత్యానికి పాల్పడ్డావని పోలీసులకు ఫిర్యాదు చేయాలా అంటూ బెదిరింపులకు పాల్పడుతుంది. కొంతమంది పరువు పోతుందనే భయంతో ఆమె అడిగిన డబ్బు ఇచ్చేవారు. ఇలా వచ్చిన డబ్బుతో జీవితాన్ని ఎంజయ్ చేస్తుంది. ఈమె వయసు 22 సంవత్సరాలు.ఈ నెల 21న విశాఖకు చెందిన యువకుడు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా ఆ యువతిని గుర్తించి కటకటాల్లోకి నెట్టారు.

Related Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

457 COMMENTS