Saturday, December 3, 2022

అప్పుడు టీమ్ ఇండియాకు సాయం చేసిన ఆటగాడు, ఇప్పుడు దాల్ పూరి అమ్ముకుంటున్నారు!

అప్పుడు టీమ్ ఇండియాకు సాయం చేసిన ఆటగాడు, ఇప్పుడు దాల్ పూరి అమ్ముకుంటున్నారు!
2003లో న్యూజిలాండ్ పర్యటనకు భారత్ సిద్ధమవుతోంది. కివీస్ జట్టుకు మొదటి నుంచి మంచి బౌలింగ్ దళం ఉండేది. ఆ సమయంలో స్పిన్నర్ డేనియల్ వెటోరి మంచి ఫామ్‌లో ఉన్నాడు. భిన్నమైన బౌలింగ్ యాక్షన్‌తో ప్రపంచ బ్యాట్స్‌మెన్‌కి చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో సొంతగడ్డపై భారత బ్యాట్స్‌మెన్‌లకి సవాల్ విసిరేలా కనిపించాడు. ఇది భారత జట్టుని కలవరపాటుకి గురిచేసింది. దాంతో అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్ర చర్చలు చేశాడు. చివరకు అస్సాంకి చెందిన ఎడమ చేతి వాటం స్పిన్నర్ ప్రకాశ్ భగత్‌ని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) దాదా పిలిపించాడు.ప్రకాశ్‌ బౌలింగ్‌ యాక్షన్‌.. వెటోరీ బౌలింగ్ యాక్షన్‌ని పోలి ఉండటంతో భారత బ్యాట్స్‌మెన్లందరూ అతని బౌలింగ్‌లో కఠోర సాధన చేశారు. దీంతో టీమిండియా బ్యాట్స్‌మెన్లు న్యూజిలాండ్ టూర్‌లో డేనియల్ వెటోరీపై బాగా ఆడగలిగారు.


ఎన్‌సీఏలో టీమిండియాకి బౌలింగ్‌ సాయం చేసిన తర్వాత అస్సాం తరఫున మ్యాచ్‌లు ఆడిన ప్రకాశ్ భగత్.. బీహార్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉంది. అస్సాం తరఫున దాదాపు అన్ని స్థాయి క్రికెట్‌లోనూ ఆడిన ప్రకాశ్ భగత్ 2010-11లో చివరిగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడాడు. ఆ తర్వాత ప్రకాశ్ తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు భుజాన పడ్డాయి.టీమిండియాకు నెట్స్‌లో ఎంతగానో ఉపయోగపడిన ప్రకాశ్.. ఒక్కసారి కూడా జట్టులోకి అడుగుపెట్టలేకపోయాడు. తనతో పాటు అసోంకు ఆడిన క్రికెటర్లు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారని, తనకు మాత్రం బోర్డు ఎలాంటి సాయం చేయలేదని ప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశాడు.ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు. రోజుకి మూడు పూటలా భోజనం కూడా చేయలేని పరిస్థితి. అస్సాం జట్టుకు అప్పట్లో నాతో కలిసి ఆడిన క్రికెటర్లు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు. కానీ నేను మాత్రం రోజు దాల్ పూరి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నా’ అని 38 ఏళ్ల ప్రకాశ్ భగత్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

251 COMMENTS

Comments are closed.

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...